ఈ మధ్యకాలంలో తరచుగా పండుగలు వస్తున్నాయి. ఈ సంతోషకరమైన సమయంలో కాస్త ఎక్కువే తింటారు. ముఖ్యంగా తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారని ఆందోళన కొందరిలో ఉంటుంది. అయితే మన ఫిట్నెస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము బరువు పెరగకుండా ఉండొచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా బరువు పెరగకుండా ఉంచుకోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్కలంగా నీరు త్రాగాలి- శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంచుకోవడానికి కనీసం రోజుల్లో 8 నుండి 10 గ్లాసుల నీరు తీసుకోవాలి. ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది బరువును నియంత్రించేలా చేస్తుంది. మన జీవన క్రియాను మెరుగుపరుస్తుంది. నీరు త్రాగడం వల్ల ఆకలి కూడా వెయ్యరు. దీనివల్ల బరువు పెరుగుతారని సందేహం ఉండదు.
Health Tips: ఒకరోజులో మన శరీరానికి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసా ...
వాకింగ్- మీరు పండగ వాతావరణం లో అనేక తినబండారాలు తింటూనే ఉంటారు. అయితే అవి తిన్నా కూడా మీరు ప్రతిరోజు కనీసం ఒక 405 నిమిషాల పాటు నడిస్తే క్యాలరీలన్నీ కూడా బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం ద్వారా గుండెకు మంచిది. అంతే కాకుండా కొలెస్ట్రాల్, బిపి, షుగర్ వ్యాధులు ఉన్న వారికి కూడా నడకా చాలా మంచిది.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి- మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ,ప్రోటీన్లు ఎక్కువగా ఉండేటువంటివి తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లో తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు పండ్లు డ్రై ఫ్రూట్స్ మొలకెత్తిన గింజలను తీసుకోవడం ద్వారా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా కడుపు ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. కాబట్టి మనము బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎక్సర్సైజ్- చాలామంది బయట నడవలేని స్థితిలో జిమ్ కి వెళ్తూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ బరువు అదుపులో ఉండవటమే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఫిట్ ఉంటారు. ఈ జిమ్ లో చెమటలు పట్టేలా మన శరీరానికి కాస్త శ్రమను ఇచ్చినట్లయితే మన జీవక్రియ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా ఇది క్యాలరీలను బర్న్ చేస్తుంది తద్వారా బరువు తగ్గుతారు. ఇటువంటి చిట్కాలు పాటించడం ద్వారా మీరు కొన్నిసార్లు డైట్ ని తప్పినా కూడా బరువు అదుపులో ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి