milk

నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆయుర్వేద నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. నెయ్యి ఎముకలకు చాలా ఉపయోగకరం. అయితే చాలామందిలో బరువు పెరుగుతుందనేసి నెయ్యి తినడం మానేస్తూ ఉంటారు. అయితే నెయ్యి తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు నెయ్యిని తీసుకోవడం ద్వారా మన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మెదడుకు మంచిది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగితే మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ క్రియ- నెయ్యిలో బ్యుట్రిక్ ఆసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల మన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కడుపులో అల్సర్స్ ను వాపును తగ్గిస్తుంది. గెట్ బ్యాక్టీరియాను పెంచుతుంది.

చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది- విటమిన్ ఏ డి కే అనే పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాలతో పాటు చర్మాన్ని కూడా మెరిసే లాగా చేస్తాయి. ఒక చెంచా నెయ్యిని వేడి పాలలో కలుపుకొని తాగడం ద్వారా మీ చర్మం మెరుస్తుంటుంది.

Health Tips: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా.

నిద్ర కోసం- పాలు నెయ్యి రెండు నిద్రలేమి సమస్యను తగ్గించి మంచి నిద్రకూ సహకరిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది.

కీళ్ల నొప్పులు- మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూను నెయ్యి కలిపి తాగడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని వాపులను నొప్పులను తగ్గిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి