వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా యాంటీబయోటిక్స్ తీసుకోవడం ద్వారా అది మన శరీరానికి హాని కలిగిస్తుంది. జ్వరము, జలుబు, దగ్గు వచ్చిన వెంటనే చాలామంది యాంటీబయోటిక్స్ వాడడం మొదలు పెడతారు. అయితే ఇది ఆ జబ్బును తగ్గించినప్పటికీ కూడా మిగతా అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్- యాంటీబయోటిక్స్ ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇది దీనివల్ల మనము తర్వాత కాలంలో ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పటికీ కూడా అది మన శరీరం పైన పనిచేయవు. యాంటీబయోటిక్స్ ను అధికంగా తీసుకోవడం ద్వారా లేకపోతే అసంపూర్ణంగా ఆ కోర్సును పూర్తి చేయడం ద్వారా ఈ సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది యాంటీబయోటిక్స్ ను మధ్యలోనే మానివేస్తారు. దీని ద్వారా మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు. ఆ తర్వాత ఎన్ని యాంటీబయోటిక్స్ఇచ్చినా అవి పని చేయవు.
రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది- యాంటీబయోటిక్స్ లో రకరకాలు ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఏ వేదైనా వచ్చినప్పుడు శరీరము తగినంతగా స్పందించదు దీని ద్వారా సీజనల్ వ్యాధులు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా.
జీర్ణ సమస్యలు- యాంటీబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. మన జీర్ణక్రియ పైన అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. యాంటీబయాటిక్స్ వల్ల అజీర్ణము, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. కొన్నిసార్లు వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఈస్ట్ ఇన్ఫెక్షన్- అత్యధికంగా యాంటీబయోటిక్స్ వాడడం ద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ముఖ్యంగా ఇది మోకాళ్ళ, మధ్య తొడల దగ్గర ,ప్రైవేటు ప్రాంతాలలో రొమ్ముల దగ్గర ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది.
ఎప్పుడు వేసుకోవాలి- అవసరమైనప్పుడు మాత్రమే యాంటీబయోటిక్ మాత్రలు వేసుకోవాలి. వైద్యుని సలహాతో మాత్రమే యాంటీబయోటిక్స్ తీసుకోవాలి. యాంటిబయాటిక్ లను పూర్తిగా కోర్స్ కంప్లీట్ అయ్యేవరకు వాడాలి. అయితే యాంటీబయోటిక్లకు బదులుగా యాంటీబయోటిక్ వ్యాక్సిన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. డాక్టర్ సలహా మేరకు దీన్ని తీసుకున్నట్లయితే మీ రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.