ginger

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో తరచుగా రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. దీని ద్వారా జలుబు దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే చలికాలంలో సొంటి బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియకు మంచిది- అల్లం, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. బెల్లం ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఈ రెండిటి కలయిక వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది- బెల్లంలో ఐరన్, మెగ్నీషియం ,పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థని పెంచుతాయి. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జలుబు దగ్గు. గొంతు నొప్పి పట్టే సమస్యలను తగ్గిస్తుంది.

కీళ్ల నొప్పులకు- సొంటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వికీల నొప్పులు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. బెల్లం లో క్యాల్షియం ,పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉండే ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ రెండిటి కలయిక ద్వారా కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా

రక్తపోటు తగ్గుతుంది- బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా బిపి ఉన్నవారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు. అంతేకాకుండా సొంటె రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఇది రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండిటి కలయిక వల్ల బిపి సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు.

చర్మాని మెరిసేలా చేస్తుంది- అల్లం మన శరీరంలో ఉన్న టాక్సిన్ బయటికి పంపించి చర్మాని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని నిగారింపును అందిస్తుంది. బెల్లం లో ఉండే మినరల్స్ చర్మానికి పోషణ్ అందిస్తాయి. ఈ రెండిటి కలయిక వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. తేమను తేమ ఉండడం ద్వారా వృద్ధాప్య ఛాయలన్నీ కూడా తొలగిపోతాయి. మచ్చలు, మొటిమలు వంటివి కూడా తొలగిపోతాయి.

ఎలా ఉపయోగించాలి- కషాయం నీటిలో బెల్లము అల్లం ముక్కలు వేసి కషాయం లాగా చేసుకున్నట్లయితే జలుబు ,దగ్గు అంటే సమస్యలు తొలగిపోతాయి. టీ రూపంగా కూడా చేసుకోవచ్చు. టీ లో చక్కెరకు బదులుగా బెల్లము, అల్లము ఉపయోగించవచ్చు. ఖాళీ కడుపుతో బెల్లము చిన్న అల్లం ముక్కలు తినడం వల్ల కూడా రోజంతా శక్తి లభిస్తుంది. వాత పిత్త కఫ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి