అవిస గింజలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ అవిస గింజలను ప్రతిరోజు తీసుకుంటే మన శరీరానికి చాలా శక్తి అందుతుంది. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవిస గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఏమైనా ఆసిడ్స్ పొటాషియం ఫాస్ఫరస్ విటమిన్ ఏ విటమిన్ సి జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు అన్నీ కూడా లభిస్తాయి.
శక్తికి: ప్రతిరోజు ఒక స్పూను వేయించిన అవిస గింజలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి చాలా శక్తి అందుతుంది. ఇందులో ఉన్న పోషకాలు వల్ల మన శరీరంలో శక్తి అనేది ఏర్పడి రోజంతా చురుకుగా ఉంటాము.
జీర్ణశక్తికి: ప్రతిరోజు ఒక స్పూన్ అవిస గింజలను మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడి గ్యాస్ మలబద్ధకం ,ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Tips: షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా.
విటమిన్స్, మినరల్స్: అవిస గింజల్లో ముఖ్యంగా విటమిన్ సి, ఐరన్, పొటాషియంతో పాటు అనేక రకాలైనటువంటి విటమిన్లు, మినరల్స్ చాలా ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఎలా తీసుకోవాలి: అవిసె గింజలను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఇందులో మోనో సచ్ రెటడ్ ప్యాట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్, ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడు కూడా వేయించి తీసుకోవాలి. వీటిని పొడి లాగా చేసుకొని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.