chips

చిన్నపిల్లలు ఎక్కువగా చిప్స్ ను ఇష్టపడుతుంటారు. మార్కెట్లో లభించే రకరకాల చిప్స్ ను చూసి ఆకర్షితులు అవుతారు. అవి తినడము వారికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. కానీ అందులో ఉన్న హానికరమైన పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతింటాయి. కాబట్టి చిప్స్ ను ఇవ్వకపోవడమే మంచిది. చిప్స్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్కెట్లో రకరకాల చిప్స్ కనిపిస్తూ ఉంటాయి.

ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వాటిలో ఎక్కువగా సాల్ట్ ని కలుపుతారు. సాల్ట్ ని కలపడం వల్ల చిన్న పిల్లల కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. చిప్స్ వాడడానికి ఉపయోగించే నూనెలు మరలా మరలా వేడి చేయడం ద్వారా దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఏర్పడి కొలెస్ట్రాల్ పెరగడానికి సహకరిస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా చంటి పిల్లల్లో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా దీంట్లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చిప్స్ లో ఉండే ట్రాన్స్ఫార్ట్లు పిల్లల శరీరంలో కూడా కొలెస్ట్రాలను పెంచే లాగా చేస్తుంది. దీని ద్వారా వారి రక్తప్రసన్నంలో అడ్డు ఏర్పడుతుంది. దీనివల్ల చిన్న పిల్లల్లో కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

చిప్స్ తీసుకోవడం వల్ల చిన్నారులు అధిక బరువుతో ఇబ్బంది పడతారు. దీని ద్వారా పిల్లల్లో కూడా ఉబకాయం వచ్చే అవకాశం ఉంది. చిప్స్ల్ లో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది వారి శరీరానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది.చిప్స్ లో అసలు ఫైబర్ అనేది ఉండదు. కాబట్టి పిల్లల్లో మలబద్దక సమస్య అనేది బాగా పెరుగుతుంది. ఇది కూడా శరీర బరువును పెంచుతుంది. ఈ మలబద్ధకం సమస్యతోటి పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: కీవి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు..

చిప్స్ తీసుకోవడం వల్ల ఆ నూనెను చిప్స్ కోసం తయారు చేసే నువ్వు నేను పదే పదే వేడి చేయడం ద్వారా క్యాన్సర్ దాటిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్ జీర్ణసంబంధ సమస్యలు, పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరచూ బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. కాబట్టి చిప్స్ను పిల్లలకు పెట్టకపోవడమే ఉత్తమం. దాని బదులు మనం ఇంట్లోనే తయారు చేసిన కొన్ని చిరుతిండ్లను సాధ్యమైనంత వరకు పిల్లలకు ఇవ్వాలి. మనం చేసే పిండి వంటలు చాలా ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా పల్లి పట్టిలు, నువ్వుల పట్టిలు, మిల్లెట్ తో చేసిన లడ్డు లాంటివి జంతికలు ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, సలాడ్స్ లాగా పిల్లలకు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు ఇచ్చినట్లయితే వారు అనారోగ్య సమస్య నుంచి బయటపడి వారికి చాలా పోషకాలను అందించిన వాళ్ళము అవుతాము. బెల్లం పట్టీలు నువ్వుల పట్టీల ద్వారా పిల్లల్లో క్యాల్షియం పెరుగుతుంది, ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మినుములు మిల్లెట్స్ తోటి శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది దీని ద్వారా పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.