లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నిమ్మకాయ రసంలో లవంగ పొడిని కలుపుకొని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ రెండిటి కలయిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
జీర్ణశక్తికి మంచిది- లవంగా ,నిమ్మకాయల కలయిక జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణము కడుపునొప్పి, ఫైల్స్ వంటి సమస్యతో బాధపడే వారికి ఇది అద్భుత వరంగా చెప్పవచ్చు. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన జీర్ణాశయంలో ఏర్పడే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. అంతేకాకుండా నిమ్మకాయలో విటమిన్ సి అధిక ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ పుల్లని రుచితో ఉండడం ద్వారా లాలాజలం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా మన జీర్ణక్రియ ప్రక్రియ సులభంగా అవుతుంది.
కండరాల నొప్పులు- ఎముకలు, కండరాల నొప్పుల సమస్యను తగ్గించడంలో నిమ్మకాయ లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మకాయల విటమిన్ సి ఎముకలకు దృణాన్ని అందిస్తుంది. లవంగాలలో ఉండే యూజనల్ అనేది సహజ నొప్పిని నివారణగా పనిచేస్తుంది. కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు. దీన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఆర్థరైటిస్వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.
శ్వాస సంబంధ జబ్బులు- శ్వాస ,ఊపిరితిత్తుల సంబంధం జబ్బులతో బాధపడే వారికి ఇదే అద్భుత వరంగా చెప్పవచ్చు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు లవంగం నిమ్మరసం కలిపినది తీసుకున్నట్లయితే శ్వాస సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఊపిరితిత్తుల్లో పేర్కొన్న స్లేష్మం తొలగిపోతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. శ్వాసకోశనాలల్లో వాపును తగ్గిస్తుంది. దీని ద్వారా మీ శ్వాస సులభతరం అవుతుంది. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది- లవంగాలు నిమ్మరసం తీసుకోవడం ద్వారా మీరు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ జబ్బులతో పోరాడడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. నిమ్మకాయల విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం ద్వారా సీజనల్గా వచ్చే వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
ఎలా తయారు చేసుకోవాలి- లవంగాలను దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మరసంలో రెండు గ్రాముల లవంగాల పొడిని కలుపుకొని తాగినట్లయితే అనేక రకాల జబ్బులు తగ్గిపోతాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి