మన రోగ నిరోధక శక్తి పెరగడానికి మనము మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలకు వాటి రంగును బట్టి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకుపచ్చ ఎరుపు వంటి రంగుల్లో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ పోషకాలు ఉంటాయి. అదే విధంగా నలుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ బ్లాక్ ఫుడ్స్ చాలా ఆరోగ్యానికి మంచిది. అయితే ఇందులో మనం చెప్పుకోవడానికి ఉన్నవి బ్లాక్ రైస్, నల్ల మిరియాలు, బ్లాక్ బెర్రీస్, నల్ల నువ్వులు, బ్లాక్ డేట్స్. వంటి వాటిల్లో అనేక రకమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి.
ఇందులో పోషకాలతో పాటు మినరల్స్ విటమిన్స్ ముఖ్యంగా ఉంటాయి. ఇవి మనం రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించి మన శరీరాన్ని శక్తివంతం చేయడానికి సహాయపడతాయి .ఇందులో యాంతో సైనిక్ అనేటువంటి వర్ణ ద్రవ్యం కలిగి ఉండడం వల్ల వీటిని బ్లాక్ ఫుడ్స్ అని అంటారు.ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పెంపొందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్సు ఉండడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తపోటు ,షుగర్ వంటి వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బ్లాక్ రైస్ లో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
బ్లాక్ రైస్ ప్రయోజనాలు- బ్లాక్ రైస్ లో లూటీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనకు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లాక్ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ పోరాటంలో సహాయపడుతుంది. బ్లాక్ రైస్లను పులావుగా, బిర్యానీగా, దోస రూపంలో,ఇడ్లీ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి ఇందులో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి జీలకర్ర మెరుగుపరుస్తుంది. ఎక్కువగా ఉండటం ద్వారా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ఉత్తమం.
Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా.
చర్మాన్ని, జుట్టు సంరక్షించడంలో- బ్లాక్ రైస్ లో మోనోసాక్యురేటెడ్ ఫ్యాట్స్ ,పాలిక్ పెనాల్ అధికంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని, జుట్టు సంరక్షించడంలో సహాయపడతాయి.
ప్రతిరోజు బ్లాక్ రైస్ తీసుకోవడం ద్వారా కడుపు సంబంధ సమస్యలకు చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా విటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటుంది. దీని ద్వారా మనకు ఇమ్యూనిటీ పెరిగి అనేక జబ్బుల నుండి బయట పడేస్తుంది కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది- ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, డైటరి ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా ఇది మన దంతాలకు కూడా చాలా మంచిది. ఇందులో సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.