Turmeric (Photo Credits: IANS)

పసుపును మనము అన్ని వంటల్లో వాడుతూ ఉంటాం. ఇది ఆహారానికి మంచి రుచిని రంగును ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పసుపులో పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపును తీసుకోవడం ద్వారా అనేక రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు- ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగడం వల్ల అధిక బరువుతో బాధపడేవారు వారి కొవ్వు తగ్గించుకోవడానికి పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం ద్వారా మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దీని ద్వారా మీరు బరువు తగ్గుతారు.

జీర్ణశక్తికి- ఖాళీ కడుపుతో పసుపు నీరు తీసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడేవారు. ఈ నీటిని తీసుకున్నట్లయితే మీకు ఉపశమనం కలుగుతుంది. ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా మన శరీరం డీటాక్స్పై అవుతుంది. దీని ద్వారా మన శరీరంలో పేర్కొన్న మరణాలన్నీ కూడా బయటికి వెళ్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం ద్వారా మన శరీరంలో ఇన్ఫెక్షన్లను వాపును తగ్గిస్తుంది. జీర్ణ క్రియ కు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని ఇస్తుంది.

Health Tips: పాలతో పాటు ఈ 5 కూరగాయలను తింటున్నారా.

ఇమ్యూనిటీ- పసుపు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ కడుపుతో పసుపు నీరు తీసుకోవడం వల్ల సీజనల్ గా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

షుగర్ ను తగ్గిస్తుంది- పసుపులో కర్కమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న ఇన్సులిన్లు నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు కాళీ కడుపుతో పసుపు నీరుని తీసుకున్నట్లయితే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

ఎవరు తీసుకోకూడదు

పసుపుని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమందిని వాటిని తాగకుండా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు పసుపును అధికంగా తీసుకోకూడదు. వేడి చేసే ప్రభావం ఉంటుంది.కాబట్టి గర్భిణీలు దీన్ని తీసుకోకూడదు.

అదేవిధంగా కొలెస్ట్రాల్ మందులు వాడేవారు కూడా పసుపును అధికంగా తీసుకోకూడదు. ఎలర్జీ సమస్యతో బాధపడేవారు కూడా పసుపు నీటిని తీసుకోకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.