ఆపిల్ ని ప్రతిరోజు తిన్నట్లయితే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు. అని ఒక సామెత ఉంది. ఆపిల్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజు తిన్నట్లయితే మనము అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మనకు ఎక్కువగా ఎరుపు రంగు యాపిల్స్ మాత్రమే మార్కెట్లో కనిపిస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో గ్రీన్ యాపిల్స్ కూడా వస్తున్నాయి. ఇవి తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్స్ ,ఫైబర్ అధికం-ఎరుపు ఆపిల్ తో పోలిస్తే గ్రీన్ ఆపిల్ లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా బరువు తగ్గుతారు. ఆకలి నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. అతిగా తినకుండా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనివల్ల క్రమంగా బరువు తగ్గుతారు.
Health Tips: రక్తంలో షుగర్ లెవెల్ భారీగా పెరిగిపోయిందా...
పొటాషియం- ఎరుపు ఆపిల్ తో పోలిస్తే గ్రీన్ ఆపిల్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అంతేకాకుండా కొటేషన్ ఎక్కువగా ఉండడం ద్వారా అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీ బీపీ సమస్య నార్మల్ లో ఉంటుంది.
క్యాన్సర్ ను తగ్గిస్తుంది- గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేస్తాయి. దీనివల్ల మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో గ్రీన్ ఆపిల్ సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థ- గ్రీన్ ఆపిల్ తీసుకోవడం ద్వారా మన జీవ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా కలిగి ఉండడం ద్వారా అజీర్ణం, మలబద్ధకం ,గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి