చీజ్ లో క్యాల్షియం అధికంగా ఉన్నప్పటికీ అయితే అధికంగా చీజ్ తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చీజ్ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక ట్రాన్స్ ఫ్యాట్- చీజ్ ను హైడ్రోజన్ కూరగాయల నూనెలతోటి తయారు చేస్తారు. వీటిలో అధికంగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ గుండె జబ్బులకు ఉపకాయానికి ,శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను పెంచుతాయి. రెగ్యులర్గా సీజన్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని గుండె జబ్బులకు కారణం అవుతుంది.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
జీర్ణ సమస్యలు- చీజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి మన జీర్ణక్రియలో సమస్యలను కలగజేస్తాయి. ముఖ్యంగా కడుపు కడుపు సంబంధ సమస్యలు ఉన్నవారు లో గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం ఒక్కొక్కసారి ఎలర్జీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
కృత్రిమ చీజ్ - ఈ మధ్యకాలంలో చాలామంది కృత్రిమంగా చీజ్ ను తయారు చేస్తున్నారు. వెజిటేబుల్ ఆయిల్స్ ,పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిని బంగాళాదుంప, మొక్కజొన్న, ను కలిపి చీజ్ను తయారు చేస్తున్నారు. ఇది ఆరోగ్యం పైన అనేక రకాల ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ ,క్యాల్షియం వంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందించదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి