గ్రీన్ టీ మనందరికీ తెలుసు. గ్రీన్ తో గ్రీన్ టీ లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. గ్రీన్ టీ ని ముఖ్యంగా చాలామంది వెయిట్ లాస్ కోసం వాడుతూ ఉంటారు. అయితే కేవలం వెయిట్ లాస్ కోసం కాకుండా మన ఇమ్యూనిటీ కోసం కూడా ఈ గ్రీన్ టీ ని మనము తీసుకోవచ్చు. మార్కెట్లో లభించే గ్రీన్ టీ మాత్రమే కాదు మన ఇళ్లలో కూడా మనం గ్రీన్ టీ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం తులసి ఆకులను ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా పుదీనా ఆకులు, జామ ఆకులు వీటితో కూడా మనము గ్రీన్ టీం ప్రిపేర్ చేసుకోవచ్చు.
తులసి గ్రీన్ టీ: తులసాకుల తోటి గ్రీన్ టీన్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే అది మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా దాంట్లో ఉన్న ఆంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియన్ లక్షణాల వల్ల మీకు వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఇది మన ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. తులసిటిని నాలుగు తులసికులు తీసుకొని వేడి నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత కాస్త తేనె కలుపుకొని తీసుకొవాలి.
Health Tips: పంచదారని మానేస్తే మీ శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల ...
పుదీనా గ్రీన్ టీ: పుదీనాతో కూడా మనం గ్రీన్ టీ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా కూడా ఆంటీ వైరల్ ,ఆంటీ ఫంగల్ ,లక్షణాల అధికంగా ఉంటాయి. ఈ పుదీనాను రెగ్యులర్ గా మనము తీసుకున్నట్లయితే మన శరీరానికి ఇమ్యూనిటీని అందిస్తుంది. పుదీనా టీ వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వవచ్చు.
జామాకు గ్రీన్ టీ: జామకాయలో ఎన్ని అయితే పోషక విలువలు ఉన్నాయో జామ ఆకులో కూడా అదే విధంగా అన్ని పోషకాలు ఉన్నాయి. జామాకుల లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక బరువుతోటి బాధపడేవారు తీసుకున్నట్లయితే మీకు శరీర బరువు తగ్గుతుంది. అంతేకాకుండా మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఈ జామాకు కషాయం చాలా బాగా ఉపయోగపడుతుం.ది . మీకు ఇమ్యూనిటీ పెరిగి మన శరీరంలో వచ్చే చిన్న చిన్న వైరల్ ఫీవర్లను తగ్గించడానికి ఈ జామాకు కషాయం ఉపయోగపడుతుంది. జామ ఆకులను తీసుకొని వాటిని నీటిలో మరిగించి వడకట్టుకోవాలి. ఈ నీటిలో కాస్త నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు అధిక బరువు ఉన్న వారికి కూడా ఈ సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.