Health Tips: ఈ మధ్యకాలంలో అందరిలో కనిపించే సమస్య మధుమేహం మధుమేహం సమస్య ఉన్నవారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు తీసుకునే ఫుడ్ లో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో షుగర్ పేషంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది తింటే మంచిది ఏ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అనే విషయాల గురించి తెలుసుకుందాం.
వీటిని తీసుకోవాలి- షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ కి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అంతేకాకుండా ప్రాసెస్ చేయని ఫుడ్స్ తృణధాన్యాలు పండ్లు కూరగాయలను తీసుకోవాలి. నట్స్ సీడ్స్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. తోటకూర, పాలకూర ఆకుకూరల్లో ఫైబరు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బ్లూ బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటివి కూడా తీసుకోవచ్చు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బాదం వాల్నట్స్ చియా సీడ్స్ గింజల్లో హెల్దీ ఫ్యాట్స్ ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా వీరు ఫిష్ తీసుకోవచ్చు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి శనగలు ప్రోటీన్ అధికంగా ఉంటుంది, బ్రౌన్ రైస్ క్వినోవా వంటివి తీసుకోవచ్చు, వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు ...
తినకూడని ఆహారాలు- మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆహారాల జోలికి వెళ్ళకూడదు. అవి ఏంటంటే సోడా కూల్ డ్రింక్స్ టీ కాఫీలు స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా బ్రెడ్ తర్వాత జంక్ ఫుడ్స్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన నాన్ వెజ్ ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చికెన్ డోనట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లో చేసిన సోడియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో సోడియం అధికంగా ఉండడం ద్వారా మీకు షుగర్ తో పాటు బీపీ కూడా పెరుగుతుంది. దీనివల్ల అనేక అనర్ధాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
డైట్ ప్లాన్- మధుమేహం ఉన్నవారు వారు వారు తీసుకునే ఆహారాన్ని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉంటాయి. రోజుకు అధిక సార్లు తక్కువ తినేలాగా చూసుకోవాలి. ఒకటి రెండు స్నాక్స్ ఉండేలాగా కూడా చూసుకోవాలి. వీటి వల్ల మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వారానికి కనీసం నాలుగు రోజులపాటు వాకింగ్ వ్యాయామం వంటివి చేస్తే మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి