source: pixabay

Health  Tips:  ఆర్థరైటిస్  సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఉంటుంది. పెరగడం ద్వారా మరియు రక్తంలో బి12 విటమిన్ డి డెఫిషియెన్సీ వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఈ ఆర్థరైటిస్ సమస్య వల్ల కండరాల్లో నొప్పులు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు వంటి వాటితో తీవ్రంగా అయితే అటువంటివారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అంతే కాకుండా మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమస్యతో బాధపడేవారు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. పుల్లటి పెరుగు, మజ్జిగ, టమాట, నిమ్మకాయ, సిట్రస్ జాతి పండ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటివల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ మరింతగా పెరిగిపోయి ఆర్థరైటిస్ సమస్య ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే కీళ్ల నొప్పులు సమస్య నుంచి బయటపడవచ్చు.

Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా

ఈ ఆహారాలను చేర్చుకోవాలి..  ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు మెంతులు చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులను మొలకలుగా చేసుకొని తినడం ద్వారా ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. అయితే మెంతులు మామూలుగా తీసుకోవడం కాస్త చేదుగా అనిపించినప్పుడు వీటిని నాన్న పెట్టి మొలకెత్తడం వల్ల అవి చేదుగా ఉండవు. వీటిని మీరు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయిఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. పచ్చి పసుపు పాలల్లో కలుపుకొని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఆహారంలో పండ్లు కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్యకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మీరు ఆహారంలో ఇంగువను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది కూడా ఆర్థరైటిస్  సమస్యను తగ్గిస్తుంది. వీరు రాగులు మినుములు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి కూడా ఆర్థరైటిస్ సమస్యలు తగ్గిస్తా యి.

Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.