
Health Tips: మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం పోషకాహారాలతో పాటు విటమిన్లు కూడా మన శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను వారి ఇవ్వకుండా చేస్తాయి. అయితే ముఖ్యంగా విటమిన్ కె మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ కె లోపం వల్ల ఎటువంటి జబ్బులు వస్తాయో దాన్ని సహజంగా లభించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ కె మన గుండె ఆరోగ్యానికి ఎముకల పెరుగుదలకు రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే ముఖ్యమైన విటమిన్ ఈ విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ కే లోపం సంకేతాలు..ఏదైనా గాయం అయినప్పుడు రక్తస్రావం ఆగకపోవడం ఎముకలు పెలుసు బారడం తొందరగా విరిగిపోవడం ఎముకల్లో బలం లేకపోవడం. శరీరంలో క్యాల్షియం అధికంగా పేరుకు పోతుంది. దీనివల్ల జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూరలను పచ్చిగా తినకూడదు ...
గుండెకు, ఎముకలకు చాలా మంచిది- విటమిన్ కె అనేది విటమిన్ డి లాగా కొవ్వులో కరిగే విటమిన్ కె ఇది చాలా ముఖ్యమైన ది. దీని లోపం వల్ల గుండెజబ్బులు వచ్చా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుండె బలోపేతానికి ఎముకల దృఢత్వానికి విటమిన్ చాలా అత్యవసరం.
విటమిన్ కె దొరికే ఆహారాలు- విటమిన్ కే సహజంగా లభించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా క్యాబేజీ, బ్రకోలి, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మాంసాహారం, చేపలు, గుడ్లు ఇవ్వండి వాటిల్లో కూడా విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. ఒకవేళ మీరు మరి ఎక్కువ కె విటమిన్ లోపంతో బాధపడుతుంటే వైద్యులే సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి