ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం వచ్చే ముందు మన శరీరానికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా మెడ నల్లబడడం. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దీన్ని మధుమేహంగా అనుకోరు. మెడను శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చింది అని అనుకుంటారు. అయితే ఇది శుభ్రత లోపం కాదు. ఒక్కొక్కసారి ఇది మధుమేహం లక్షణంగా చెప్పవచ్చు. దీన్ని సకాలంలో గుర్తించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము.
మెడ నలుపు- ఈ మధ్యకాలంలో చాలామంది మెడ పైన నల్లటి ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నిపుణుల ప్రకారం ఇది కేవలం శుభ్రత లోపం మాత్రమే కాదు. మన శరీరంలో జరుగుతున్న కొన్ని అనారోగ్య సమస్యలకు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది షుగర్ కు సంబంధించింది దీన్ని ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్టు చేయించుకుంటేమంచిది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్- ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ అనేది మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడానికి ఒక సంకేతం. ఇది ఇలా అయినప్పుడు మన మెడ నల్లగా మారుతుంది. అయితే దీన్ని విస్మరించకుండా త్వరగా టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇది పిల్లల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది.
Health Tips: థైరాయిడ్ రోగులు పొరపాటున కూడా వీటిని తినకూడదు
మధుమేహం ఇతర సంకేతాలు- షుగర్ ఉన్నవారికి ఇంకా కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. తరచుగా ఆకలి వేయడం, నోరు ఎండిపోవడం, చర్మం పైన దద్దుర్లు రావడం, తరచుగా మూత్ర విసర్జన చేయడం, వంటివి లక్షణాలు కూడా చెప్పవచ్చు.
ఈ చిట్కాలతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు-
చక్కర వ్యాధిని నివారించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే దీని ద్వారా షుగర్ నుండి కంట్రోల్లో ఉండవచ్చు. ముఖ్యంగా మన ఆహారంలో కూరగాయలు, పండ్లు, పోషకాహారము ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవాలి. అంతే కాకుండా మన జీర్ణ క్రియను మెరుగుపరచకుండా ఉండడానికి మనం రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. అంతేకాకుండా మన శరీరానికి తగినంత నీరు తీసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడి నుండి ఆందోళన నుండి దూరంగా ఉండాలి. ఇది రక్తంలోనే చక్కర స్థాయిలను పెంచుతుంది.
మెడ నలుపుకు ఇతర కారణాలు- కేవలం మధుమేహమే కాకుండా ఇంకా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా మన మెడ నల్లగా మారుతుంది. ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికి ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్, అధిక బరువు ఉన్న వారికి కూడా మెడపైన నల్లటి పొర ఏర్పడుతుంది,వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఈ మెడ అనేది నల్లగా ఉంటుంది
నల్లటి మెడను ఎలా పోగొట్టుకోవాలి- మధుమేహం కారణంగా ఒకవేళ మీకు మెడ నల్లబడినట్లయితే దానికి సంబంధించిన చికిత్సలు తీసుకోవాలి. అలా కాకుండా మీరు పెరుగు, సెనగపిండి, పసుపు, బంగాళదుంప, పేస్టును మెడపైన రాసుకుంటే క్రమం తప్పకుండా ఇలా చేసినట్లయితే మీ మెడ శుభ్రంగా అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినట్లయితే మీ మెడ పైన ఉన్న నల్లటి మచ్చ పోతుంది. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకుంటే ఈ మెడ నలుపు సమస్య తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.