కొంతమందిలో అహనం తిన్న తర్వాత కూడా మళ్లీమళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. అయితే ఇది చిన్న సమస్య అయినప్పటికీ కూడా దీనికి మనము కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే తిన్న తర్వాత కూడా మళ్లీమళ్లీ ఆకలి వేయడం అనేది కొన్ని పోషకాలలోపంగా చెప్పవచ్చు. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం.
ఫైబర్ లేకపోవడం- మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ 30 పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పీచు పదార్థాల అధికంగా ఉన్న బీన్స్ త్రోణదాన్యాలు పండ్లు కూరగాయలు మనకు ఫైబర్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. అయితే ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మళ్లీ మళ్లీ మనకు ఆకలిగా అనిపిస్తుంది. అందుకే ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీకు కడుపు నిండినట్టుగా అనిపించి ఈ సమస్య నుండి బయటపడతారు.
ప్రోటీన్ తక్కువగా ఉండడం- మీకు ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల తరచుగా ఆకలికి దారితీస్తుంది. మీరు తీసుకున్న ఆహారాల్లో పాలు, పెరుగు, జున్ను, పన్నీర్ వంటి పదార్థాలను తీసుకుంటే ఇది మీకు కడుపు నిండినట్టుగా అనిపించి అరగడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండినట్టుగా అనిపించి ఆకలి వేయకుండా చేస్తుంది.
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా
నిద్రలేమి- నిద్రలేమి వల్ల కూడా మన ఆకలి నియంత్రించే గ్రలిన్ లెఫ్టిన్ వంటి హార్మోన్లు ప్రభావితం అవుతాయి.ఈ రెండు హార్మోన్లు కూడా ఆకలిని పెంచుతాయి. మీకు తగినంత నిద్ర లేనప్పుడు ఈ హార్మోన్ల స్థాయిలు పెరిగి తరచుగా ఆకలి అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమస్య నుండి బయటపడితే మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది
డీహైడ్రేషన్- తగినంత నీరు ఇవ్వనప్పుడు అది కూడా ఆకలిని పెంచుతుంది. మీరు డిహైడ్రేషన్కు గురి గురైనప్పుడు మీ శరీరము ఆకలి సంకేతాలను ఇస్తుంది. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ను తగ్గించవచ్చు. దీని ద్వారా ఆకలని కూడా నియంత్రించవచ్చు.
తొందరగా తినడం- కొంతమంది చాలా వేగంగా ఆహారాన్ని తీసుకుంటారు. దీని ద్వారా అది శరీరానికి తగినంత ఆహారం తీసుకుందో లేదో మెదడు సరిగ్గా గమనించదు. కాబట్టి మీరు అన్నాన్ని ఆహారాన్ని ఎప్పుడు కూడా మెల్లిగా నమ్ముతూ తీసుకోవడం ద్వారా కడుపు నిండిన అనిపించి మరల మరల ఆకలి వేయకుండా ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.