pimples

కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, వెన్ను,నొప్పి మూడ్ స్వింగ్ వంటి సమస్యలు ఉంటాయి. కానీ అదే సమయంలో కొంతమందిలో ముఖం పైన మొటిమలు రావడం అనేది గమనిస్తూ ఉంటారు. అధిక వేడి వల్ల ఉబకాయం వల్ల వస్తుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది వేడి ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుందని అనుకుంటారు. అయితే పీరియడ్స్ సమయంలో ముఖం పైన మొటిమలు ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో మొటిమలు ఎందుకు వస్తాయి

పిరియడ్స్ రావడానికి ముందు మహిళ శరీరంలో అనేక రకాలైనటువంటి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రొజెస్టర్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనికి కారణంగా మొహం పైన ఎక్కువ ఆయిల్  ఏర్పడతాయి. దీని ద్వారా మొహం పైన మొటిమలు రావడం ప్రారంభమవుతాయి. అయితే కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా కూడా మొహం పైన మొటిమలు వస్తాయి. అయితే పీరియడ్స్ సమయంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

జంక్ ఫుడ్ తినొద్దు- పిరియడ్ రావడానికి ముందు ఒక వారం నుంచే బయట ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్ లో వల్ల మొహం పైన మొటిమలు వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే మంచిది.

Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా

వ్యాయామం- వ్యాయామం చేయడం వల్ల కూడా పీరియడ్స్ సమయంలో మొటిమలు రాకుండా చేయవచ్చు. పీరియడ్స్ సమయంలో యోగ వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మొహం పైన మొటిమలు రాకుండా ఉంటాయి.

హైడ్రేటెడ్ గా ఉండాలి- పీరియడ్స్ సమయంలో డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. దీనికి కారణంగా మొహం పైన మొటిమలు ఏర్పడతాయి. ముఖ్యంగా మన శరీరంలో నీరు తక్కువైనప్పుడు ఈ సమస్య మరి అధికంగా అవుతుంది. అటువంటి అప్పుడు ప్రతిరోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. దీని ద్వారా మొటిమలు రాకుండా ఉంటాయి.

పోషకాహారం- మొహం పైన మొటిమలు రావడానికి ముఖ్యంగా జంక్ ఫుడ్ కారణమవుతుంది. అయితే ఐరన్ లోపము వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు ఈ టైంలో ఐరన్, ఫైబర్, పచ్చి కూరగాయలు, బీన్స్ ,తృణధాన్యాలు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఈ మొటిమల సమస్య నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.