Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతోటి బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అందంతోపాటు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా వస్తాయి. మన జీవన శైలిలో కొన్ని రకాలైన మార్పులు చేసుకొని ఉన్నట్లయితే ఈ రోజుల్లో స్లిమ్ అవ్వడం చాలా ఈజీ . ఈ టిప్స్ పాటించండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాయామం చేయడం:  ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కనీసం 40 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. అదే విధంగా రన్నింగ్, యోగ వాటితో మీ రోజును ప్రారంభించండి. ఇలా ప్రతిరోజు ఒక 40 నిమిషాలు మీ శరీరానికి శ్రమతో కూడిన వ్యాయమం చేసినట్లయితే కచ్చితంగా మీరు మీ బరువుని అదుపులో ఉంచుకొని చాలా ఫీట్ గా ఉంటారు.

బ్రేక్ ఫాస్ట్: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీలు, దోసాలు పూరీలకు బదులుగా ప్రోటీన్, ఫైబర్ రిచ్ గా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ ను తీసుకున్నట్లయితే మీ బరువు అదుపులో ఉంటుంది. అందుకోసం మొలకెత్తిన గింజలను, నానబెట్టుకున్నటువంటి బాదాం ఆ క్రొట్లు తీసుకున్నట్లయితే కచ్చితంగా మీ బరువు అదుపులో ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

నీరు:  ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు మంచినీరు త్రాగాలి. ఇది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో నీరు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా నీరు చాలా బాగా సహాయపడుతుంది నీవు ఎక్కువగా తీసుకున్నట్లయితే కడుపు నిండుగా ఉండి ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు తద్వారా బరువు తొందరగా తగ్గిపోతారు.

సలాడ్స్: సాయంత్రం పూట స్నాక్స్ గా జంక్ ఫుడ్ బదులు పండ్లు కూరగాయ ముక్కలు తీసుకున్నట్లయితే మీరు బదులు తగ్గుతారు ఎటువంటి ప్రభావాన్ని చూపించదు అంతే కాకుండా వీటిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ చర్మం ఎప్పుడు కూడా నివారింపుగా ఉంటుంది అదేవిధంగా మేము బరువు తగ్గించడానికి సహాయపడుతుంది

జంక్ ఫుడ్ మానేయండి: డీప్ ఫ్రై ఐటమ్స్ అదేవిధంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మీ బరువు భారీగా పెరుగుతుంది తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోయి మీరు ఫిట్ గా ఉండరు అటువంటి అప్పుడు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోండి అదేవిధంగా స్వీట్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ కార్బోహైడ్రేట్లను ఫాట్స్ను తగ్గించండి దీని ద్వారా మీ శరీర బరువు అదుపులో ఉంటుంది

రాత్రి భోజనం: రాత్రి భోజనం చాలా తేలిగ్గా ఉండాలి రాత్రి భోజనంలో ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఉత్తమమైన పని లేదా రెండు పుల్కాలు అటువంటి లైట్గా తీసుకొని తిన్న తర్వాత నిద్రకు రెండు గంటల పాటు సమయం ఉండాలి అటువంటి అప్పుడు మాత్రమే తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది తిన్న వెంటనే పడుకోకూడదు కాబట్టి డిన్నర్ అనేది రాత్రి 7:30 లోపు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ బరువు అదుపులో ఉంటుంది

ఈ టిప్స్ పాటించినట్లయితే మీరు ఎప్పుడు కూడా స్లిమ్ గా ఫీట్ గా ఉంటారు ఆరోగ్యంగా అందంగా ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ టిప్స్ పాటించండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.