ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా భానపట్ట అనేది చాలా డేంజర్. ముఖ్యంగా గుండె జబ్బులు, కాలేయ సంబంధ జబ్బులు, వంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ అధిక బరువు ని తగ్గించుకోవడానికి రకరకాల అయినపద్ధతిలో ఉన్నాయి. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ అధిక బరువు తగ్గించుకోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తొందరగా అరిగే పండ్లను తీసుకోవాలి. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం ద్వారా ఇది మీ జీర్ణ వ్యవస్థను పెంచుతుంది. తద్వారా మీ శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవకాడొ, నేరేడు పండు, అవిస గింజలు వంటి వాటిలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీరు తీసుకున్నట్లయితే ఈజీగా బరువు తగ్గుతారు.
Health Tips: రాగిజావ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ లలో అతిగా వేడి చేసిన పదార్థాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా మీ శరీరంలో కొలెస్ట్రాల శాతం పెరిగి ఇంకా బరువును పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల కూడా మీరు బరువు తగ్గుతారు. పోషకాహారం అధికంగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా పాలు, మాంసం, గుడ్లు అధికంగా తీసుకుంటే అధిక బరువు సమస్య తగ్గుతుంది.
చాలామంది ఒత్తిడితో బాధపడుతుంటారు. ఒత్తిడి కూడా మనం బరువు పెంచడానికి ఒక కారణం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేలాగా చూసుకోవాలి.
ధూమపానం మద్యపానం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండిటిని మానివేయడం ద్వారా మీకు కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా అధిక బరువు నుండి కూడా బయటపడవచ్చు.
తాజా పండ్లను తీసుకోవడం ద్వారా కూడా వాటి నుండి ఫైబర్ అనేది డైరెక్ట్ గా మన శరీరానికి అందుతుంది. తద్వారా కూడా మనము అధిక బరువు నుండి బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా తాజా పనులు తీసుకోవడం వల్ల రకరకాల ఉన్నటువంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ లోపం కూడా ఉండదు.
మీరు ఆహారంలో కచ్చితంగా కార్బోహైడ్రేట్స్ తీసివేయాలి. కార్బోహైడ్రేట్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకొని ప్రోటీన్ ఎక్కువగా ఉన్నది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీరు అధిక బరువు నుండి ఈజీగా బయటపడవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం ఆపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకున్నట్లయితే అది కూడా మీ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.