వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది జలుబు దగ్గు వంటి సమస్యతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా దగ్గు అనేది చాలా రోజులు ఉంటుంది. దీంతో పాటు గొంతు నొప్పి కూడా అధికంగా ఉంటుంది. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా చాలా ఇబ్బందిని పెట్టే సమస్య .అయితే మిరియాల తోటి మనం డికాషన్ చేసుకొని తాగినట్లయితే ఇందులో ఉన్న ఔషధ గుణాల వల్ల మనకు గొంతు నొప్పి దగ్గు తగ్గుతుంది. నల్ల మిరియాల కషాయం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, దగ్గు: నల్ల మిరియాల డికాషన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబులను తగ్గించడంలో సహాయపడుతుంది
గొంతు నొప్పి: మిరియాల లో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు. ఈ డికాషన్ తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
Health Tips: రేగి పండులో ఉన్న 5 అద్భుత ప్రయోజనాలు
ఇమ్యూనిటీ: మిరియాల లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెన్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి ఈ సీజనల్గా వచ్చే వ్యాధులతో పోరాడి మనను వాటినుండి బయటపడేస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు కి ఈ నల్ల మిరియాలు చాలా ఉపయోగపడతాయి.
కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం.
ఒక కప్పు నీరు, ఒక టీ స్పూన్ మిరియాలు, చిటికెడు పసుపు ,రుచికి తగినంత తేనె.
ఒక చిన్న కప్పులో నీరు తీసుకొని దాన్ని ఫ్యాన్ లో పోసి మరిగించాలి. ఇప్పుడు నల్ల మిరియాలను వేసుకొని కాసేపు మరిగించాలి. దీనికి తోడు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త తేనె కలుపుకొని తీసుకున్నట్లయితే మీకు జలుబు దగ్గు తగ్గిపోతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు తీసుకోవచ్చు. దీనివల్ల గొంతు నొప్పి దగ్గు తగ్గిపోతాయి. ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరిగి జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీకు సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుని సంప్రదించండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి