sugar

Health Tips: ప్రీ డయాబెటిక్ ఉన్నవారు టైప్ టు డయాబెటిస్ గా మారడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే ఇప్పుడు డయాబెటిక్ సమస్య సాధారణమైనప్పటికీ కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే అది టైప్ టు డయాబెటిస్ గా మారదు. అయితే టైప్ టు డయాబెటిస్ గా మారకుండా ఉండాలి. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాహారం- ఫ్రీ డయాబెటిక్ దశలో మనము ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ డయాబెటిక్ గా మారకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా కొవ్వు పదార్థాలను తీపి ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు వంటి వాటిని తీసుకోకుండా ఉండాలి. కూరగాయలు పండ్లు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది దీని వల్ల శరీరం సమతవయతను సంతరించుకొని డయాబెటిస్ రాకుండా ఉంటుంది.

Health Tips: అంజీర్ పండ్లను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు 

శారీరక శ్రమ- టైప్ టు డయాబెటిస్ ను నివారించడంలో శారీరక శ్రమ చాలా ముఖ్యం శారీరక శ్రమ చేయడం ద్వారా టైప్ టు డయాబెటిస్ గా మారకుండా ఉంటుంది దీంతో పాటు యోగ జ్ఞానం నడక సైక్లింగ్ వంటివి ప్రతిరోజు 30 నిమిషాల పాటు చేసినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు..

మెంతుల కషాయం- మెంతులను నానబెట్టి ఉదయాన్నే తాగినట్లయితే డయాబెటిస్ రాకుండా ఉంటుంది. ఫ్రీ డయాబెటిక్ రోగులకు ఇది చక్కెర చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. టైప్ టు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

ఫ్రీ డయాబెటిక్ లక్షణాలు- ఎక్కువగా దాహం అనిపించడం అధిక మూత్ర విసర్జన తరచుగా అలసిపోయినట్లు అనిపించడం బరువు పెరగడం కాళ్లలో వాపులు వంటివి డయాబెటిక్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలు గనక మీకు కనిపించినట్లయితే వైద్యుల్ని సంప్రదించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి