banana

అరటిపండు తక్షణ శక్తిని ఈయడంలో ప్రముఖ స్థానంలో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా అందుబాటులో ఉండేది. అరటిపండు పిల్లలకు పెద్దలకు అరటిపండు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఒక అరటిపండు తినాలని డాక్టర్లు చెబుతారు అరటిపండు త్వరగా జీర్ణం అవుతుంది. అయితే ఖాళీ కడుపుతో అరటిపండు తీసుకోవడం మంచిదా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అనేక రకాల పోషకాలు ఉన్న ఆ అరటిపండును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్బోహైడ్రేట్లు పుష్కలం- అరటి పండులో కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇది మనకు తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మన కండరాల బలోపేతకు ఇది సహాయపడుతుంది. కాళీ కడుపుతో తీసుకున్నట్లయితే ఇది మన శరీరానికి కావాల్సిన గ్లూకోస్ ను అందిస్తుంది. దీని ద్వారా మనం రోజంతా ఎనర్జీటిక్ గా ఉంటాము.

పొటాషియం అధికం- అరటి పండులో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. అరటిపండును ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా ఇది నరాల పనితీరుకు కండరాల పని తీరుకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనం రోజంతా పనిచేయడానికి కావలసిన శక్తిని అందిస్తుంది. చెమట రూపంలో పోగొట్టుకున్న పొటాషియంను ఇది అరటిపండు తీసుకోవడం ద్వారా మనకు తిరిగి లభిస్తుంది. ద్విని ద్వారా కండరాల నొప్పులు తిమ్మిరి అలసట నుండి బయటపడతాము.

Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

జీర్ణ క్రియకు- అన్ని పనులతో పోలిస్తే అరటిపండు తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది మన జీర్ణ క్రియ కు చాలా సహాయపడుతుంది. అరటి పండ్లు తీసుకోవడం ద్వారా మనకు పోషకాహారం పూర్తిగా లభించి మనకు పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ రాకుండా ఉంటాయి.

ఫైబర్- అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మనకు శరీరంలో ఫ్లూయిన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మనము డిహైడ్రేషన్ నుండి బయటపడతాము. ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడతాము.

ఇన్ఫ్లమేషన్- అరటిపండు లో ఫైటోస్టెరాల్స్ ,కెరోటినాయిడ్లు అధికంగా ఉండడం వల్ల ఇది మన శరీరంలో ఉన్న వాపును తగ్గిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.