వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లోకి అనేక రకాలైన పండ్లు వస్తాయి. ఇవి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే ఆపిల్ పండ్లు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ఇందులో మన ఆరోగ్యానికి మెరుగుపరిచే అనేకమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రుచికి మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనకి ఒక వరంగా చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ , ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా మనం బరువు తగ్గడంలో ఇన్ఫెక్షన్ల బారిని పడకుండా బయట పడకుండా ఉంటాయి. దీని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ వ్యవస్థ: ప్రతిరోజు ఆపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. మన జీవన వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆపిల్ సహకరిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మన జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. అంతేకాకుండా పేగుల్లో పేరుకుపోయిన అనేక రకాలైన మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఒక ఆపిల్ పండులో 6గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఇది మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీన్ని తొక్కతో సహా తీసుకున్నట్లయితే మీకు అధిక మొత్తంలో ఫైబర్ అందుతుంది. కాబట్టి పొట్టు తీయకుండా తినడమే ఉత్తమం.
గుండెకు మంచిది: ఆపిల్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మన బీపీని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. ప్రతిరోజు మీరు ఒక ఆపిల్ పండు తీసుకున్నట్లయితే మీకు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మన గుండె కళాజాలాన్ని గట్టిపడకుండా చేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో పేరుకుపోయినటువంటి ఎల్ డి ఎల్ కొలెస్ట్రాలను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాలను పెంచడంలో ఈ ఆపిల్ సహకరిస్తుంది. దీని ద్వారా మనకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె వచ్చే మంటను గుండెలో ఏర్పడినటువంటి బ్లాక్ లను తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Health Tips: ఈ 7 కారకాలు క్యాన్సర్ లక్షణాలను పెంచుతాయి
బరువు తగ్గడంలో: ప్రతిరోజు ఒక ఆపిల్ ని తీసుకున్నట్లయితే మీకు కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి ఎక్కువగా వేయదు. దీని ద్వారా మీరు అధిక బరువు నుండి బయటపడతారు. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా మీకు బరువు ఈజీగా తగ్గిపోతారు. అంతే కాకుండా దీంట్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది సహాయపడుతుంది. దీంట్లో ఫైబర్ నీరు ఎక్కువగా ఉండడం ద్వారా మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ మీ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
చర్మానికి: ప్రతిరోజు ఒక ఆపిల్ ని తీసుకున్నట్లయితే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒక మన చర్మం నిగారింపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అనేది కొల్లాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా మన చర్మం ముడత పడకుండా ఉంటుంది. అధిక శాతం నీరు ఉండడం ద్వారా మీ చర్మం ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. ప్రతి రోజు ఒక పండుని ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది చాలా ఉపయోగకరం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.