ఈరోజుల్లో చాలామంది తమ ఆహార పదార్థాలలో తేనెను భాగం చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో మనం తేనె కొన్నప్పుడు అది కల్తీదా, నిజమైనదా అనేది మనం తెలుసుకోలేము. దీనివల్ల అనేక రకాలైనఅనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈరోజు మనం ఐదు పద్ధతుల ద్వారా తేనె కల్తీ లేదా స్వచ్ఛమైనదా తెలుసుకుందాం.
తేనె నిజమైన తేనె మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది మన శరీర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రకాల జబ్బులనుండి బయటపడేస్తుంది.
అయితే మార్కెట్లో నకిలీ తేనె మన శరీరానికి విషయంలో మారుతుంది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ నకిలీ తేనెను తయారు చేస్తున్నారు. నకిలీతేనే ,స్వచ్ఛమైన తేనె రెండు కూడా చూడడానికి ఒకేలాగా కనిపిస్తాయి. మనం గుర్తించడం చాలా కష్టం అయితే కొన్ని చిట్కాల ద్వారా మనము ఇంట్లోనే తేనె స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.
స్వచ్ఛమైన తేనెను తెలుసుకోవడానికి పరీక్షలు
నీటిలో కరిగించడం: ఒక చిన్న బౌల్ లో కొద్దిగా నీరు తీసుకొని అందులో తేనెను కలపండి నిజమైన తేనె అయితే అది నెమ్మదిగా కరిగి కాస్త మందంగా ఉంటుంది.
ఒకవేళ అది నకిలీ తేనె అయితే వెంటనే నీటిలో కరిగిపోయి చాలా పల్చగా ఉంటుంది. అప్పుడు మీరు గమనించవచ్చు ఇది నకిలీ తేనే అని.
వేడి చేయడం ద్వారా: ఒక స్పూన్ లో కొంచెం తేనె తీసుకొని దాన్ని స్టవ్ మీద కాసేపు ఉంచండి. స్వచ్ఛమైన తేనా అయితే అది నెమ్మదిగా కరిగి పంచదార పాకంలో అవుతుంది, నురుగుని ఏర్పరుస్తుంది. అదే కల్తీ తేనె అయితే వెంటనే అది మండి నల్లగా మారుతుంది.
Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా
పేపర్ ద్వారా: ఒక చిన్న పేపర్ ని తీసుకొని దానిపైన కాస్త తేనె రాయండి. నిజమైన తేనె అయితే అది వెంటనే ఆరిపోతుంది. ఒకవేళ అది నకిలీతేనే అయితే అది బాగా తడిసి జిగురుగా ఉండి అక్కడ తేమగా ఉంటుంది.
అయోడిన్ పరీక్ష: ఒక చెంచాలో కొంచెం తేనె తీసుకొని అందులో రెండు చుక్కల అయోడిన్ కలపండి స్వచ్ఛమైన తేనె అయితే దాని రంగులో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ కల్తీ తేనె అయితే అది రంగు మారి నీలం రంగులో, ఊదా రంగులోని గాని మారుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.