Sleep Representative Image

చాలామంది చేసే పని రాత్రిళ్ళు భోజనం చేసిన వెంటనే నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పైన అనేక రకాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న వారిలో లేటుగా తినడం నిద్రకు భోజనానికి ఎక్కువ సమయం లేకుండా ఉండడం వల్ల అనేక రకాలైన అనారోగ్యాలు తలెత్తుతాయి. అయితే రాత్రి భోజనం నిద్రకు మధ్య ఎంత సమయం ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 -3 గంటలు- రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు నుండి మూడు గంటల మధ్య గ్యాప్ ఉండాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడానికి సమయం ఉంటుంది. దీని ద్వారా మన శరీరము తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలు అన్నిటిని కూడా గ్రహించడానికి సహాయపడుతుంది. మీరు తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తి బాధపడతారు.

జీర్ణ క్రియకు- తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. దీని ద్వారా మనం తీసుకున్న ఆహారం పైనకు కదులుతుంది. కడుపులో ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. దీని ద్వారా గుండెల్లో మంట, ఎసిడిటీ, వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీరు తిన్న తర్వాత కనీసం రెండు గంటల నుంచి మూడు గంటల గ్యాప్ ఇస్తే జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది.

బరువు తగ్గుతారు-  భోజనం తర్వాత గ్యాప్ తీసుకోవడం వల్ల మీరు బరువు కూడా తగ్గుతారు. మీరు ఆలస్యంగా తిని వెంటనే నిద్ర పోవడం వల్ల తీసుకున్న ఆహారం శక్తిగా మారదు. ఇది కొవ్వుగా పేరుకుపోయి మీ అధిక బరువు దారితీస్తుంది. కాబట్టి భోజనం తర్వాత గ్యాప్ తీసుకోవడం ద్వారా మీ బరువు కంట్రోల్లో ఉంటుంది.

Health Tips: పాలతో పాటు ఈ 5 కూరగాయలను తింటున్నారా

మంచి నిద్ర- భోజనాన్ని త్వరగా తీసుకొని రెండు గంటల గ్యాప్ తర్వాత నిద్రపోయినట్లయితే మీకు నిద్ర కూడా మంచి నిద్ర పడుతుంది. గాడ నిద్రకు ఇది సహకరిస్తుంది. దీనివల్ల మీ శరీరము విశ్రాంతి మీ శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.

నడక- రాత్రి భోజనం తర్వాత ఒక పది నిమిషాలు మీరు నడిచినట్లైతే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.  మీరు తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.