సాధారణంగా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యునా, సార్డినెస్ వంటి చేపలలో ఇది సమృద్ధిగా ఉంటుంది. అయితే కొంతమంది చేపలను తినడానికి ఇష్టపడరు. అంతేకాకుండా శాకాహారులకు ఈ ఒమేగా త్రీ యాసిడ్స్ పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే శాకాహారాల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉన్న ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చియా సీడ్స్- చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మొక్కల నుండి లభించే ఒక ముఖ్యమైన ఒమేగా త్రీ ఫ్యాట్ అబిడ్స్ లభించే వనరుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. దీని ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
Health Tips: మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా
సోయాబీన్స్- సోయాబీన్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇది గుండెను సంరక్షించడంలో కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
వాల్ నట్స్- వాల్నట్స్ తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అనేక రకాల జబ్బులను తగ్గించడంలో వాల్నట్స్ సహాయపడతాయి. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారు. ప్రతిరోజు గుప్పెడు వాల్నట్స్ తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
అవిస గింజలు- అవిస గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇది మన జీవన క్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా జీల సమస్యలు తగ్గిపోతాయి. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. జుట్టుకు చర్మానికి చాలా మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి