source: pixabay

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీని తగ్గించుకోవడం కోసం మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఫైబర్ ఎక్కువగా ఉన్న అర్పదార్థాలు తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు ఉన్న ఆహారాలను తీసుకుంటే వీరికి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రేక్ ఫాస్ట్- డయాబెటిక్ రోగులను ఉదయాన్నే టిఫిన్ గా పోషకాహార పదార్థాలు తీసుకోవాలి. దాంట్లో ఫైబర్ ప్రోటీన్లు అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. ఓట్స్ తీసుకోవచ్చు. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మొలకెత్తిన గింజలు, ఆపిల్, నారింజ వంటివి తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ సి, ఫైబరు, అధికంగా ఉంటుంది. అంతేకాకుండా నానబెట్టిన బాదం గింజలు తీసుకోవచ్చు. అవిస గింజలు, చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అందుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గ్రీన్ టీను ,నిమ్మకాయ నీరును తీసుకోవడం ద్వారా జీర్ణ క్రియ పెరుగుతుంది. ఇలాంటి టిఫిన్ తీసుకోవడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది .రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి.

Health Tips: అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండడానికి కారణాలు..

లంచ్- మధుమేహం ఉన్నవారు మధ్యాహ్నం భోజనానికి కూడా మంచి పోషకాహాలు ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. వీరి భోజనంలో రెండు రోటీలు పప్పు, తృణధాన్యాలు, వంటివి అధికంగా ప్రోటీన్లు ఉన్న వాటిని తీసుకోవడం మంచిది. తక్కువ క్యాలరీలో ఉన్న సొరకాయ, బచ్చలు కూర ,బీరకాయ ,బ్రకోలి వంటి వాటిని తీసుకోవాలి. కొంచెం పెరుగు కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని తీసుకున్నట్లయితే ఇది మీ జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. ప్రోటీన్ మంచి మూలం. ఇది ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

సాయంత్రం స్నాక్స్- మధుమేహం ఉన్నవారు సాయంత్రం పూట స్నాక్స్ విషయంలో వాల్నట్ వంటివి తీసుకోవాలి. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దోసకాయ, క్యారెట్, కీర ,వంటి పచ్చి కూరగాయలను ,సలాడ్ రూపంలో సాయంత్రం పూట స్నాక్స్ లాగా తీసుకుంటే ఇది మీకు శక్తిని అందించడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచితుంది. ఇది షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.

రాత్రి భోజనం- డయాబెటిక్ రోగులకు రాత్రిపూట భోజనంలో చాలా తేలికగా అరిగే విధంగా ఉండాలి. డిన్నర్ లో పప్పులు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఉడికించిన కూరగాయలు తీసుకోవాలి. ఫైబర్ కోసం టమా, దోసకాయ, బీరకాయ, ఉల్లిపాయలు వంటివి తీసుకోవాలి. ఒక పుల్కా లో కూర ఎక్కువగా ఉండే విధంగా తీసుకుంటే మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి