షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాకాలంలో జలుబుతో పాటు అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాకాలము ఆరోగ్య సంబంధ సమస్యలను కూడా తీసుకొని వస్తుంది. ఈ షుగర్ వ్యాధి వల్ల మీ శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. దాంతో అనేక రోగాల బారిన పడతారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎలా రక్షించుకోవాలి అనేదాన్ని గురించి మనం తెలుసుకుందాం. వీరు ప్రతిరోజు వ్యాయామం, ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు
ఆకుకూరలు ఎక్కువగా తినండి: ఈ వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా వస్తు ఉంటాయి.మెంతికూరను ఎక్కువగా తీసుకున్నట్లయితే మీ షుగర్ అనేది కంట్రోల్ లో ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కార్బోహైడ్రేట్లను వదిలేయండి: షుగర్ పేషెంట్స్ కు కార్బోహైడ్రేట్లు మరింత షుగర్ ను పెంచే అవకాశం ఉంది. మీరు సాయంత్రం పూట స్నాక్స్ , జంక్ ఫుడ్ బదులు ఉడకబెట్టిన కూరగాయ ముక్కలను అదేవిధంగా మొలకెత్తిన గింజలను తీసుకున్నట్లయితే మీ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది.
స్వీట్లు మానేయండి: మధుమేహ వ్యాధి ఉన్నవారు స్వీట్లకు దూరంగా ఉండాలి. ఈ స్వీట్ ల వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి మీ షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.
హైడ్రేటెడ్ గా ఉండండి: మధుమేహం ఉన్నవాళ్లు నీరుని పుష్కలంగా తాగండి దీని ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి టోర్నెస్ అనేవి బయటికి పోతాయి ఎల్లప్పుడూ కూడా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
వ్యాయామం చేయండి: వర్షాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి మీరు యోగా వ్యాయామం వాకింగ్ కూడా చేయొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే మీ రక్తంలోని చక్కర అనేది ఎప్పటికీ కూడా కంట్రోల్ లోనే ఉంటుంది.
అంతేకాకుండా మీ రక్తం లోని చక్కర స్థాయిలో తరచుగా చెక్ చేసుకోండి. మీ బ్లడ్ రీడింగ్ లను, ఆహారాన్ని, వ్యాయామాన్ని కూడా చేర్చుకున్నట్లైతే మీ రక్తం లో ఉన్న షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైజిన్ గా ఉండేందుకు ప్రయత్నించండి. తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోండి. సమయానికి మందులు తీసుకోండి. క్రమం తప్పకుండా డాక్టర్ తోటి మీ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసి ఉంచుకోండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.