Representative image

వర్షాకాలం చల్లదనంతో పాటు చాలా ఇన్ఫెక్షన్ కూడా తీసుకువచ్చే ప్రమాదముంది. ఇటువంటి వాతావరణంలో వైరల్ జ్వరాలు సంక్రమణ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం చాలా ఉంది. సీజనల్ ఫీవర్లు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రం తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సీజనల్ జ్వరాలను, ఫ్లూ లను వైరల్ జ్వరాలు తగ్గించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ ఫీవర్ లక్షణాలు: ఈ సీజన్లో ఎక్కువగా వైరస్ తో వచ్చే జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మొదట సాధారణంగా జ్వరం అనుకుంటారు. ఇది ఒకటి నుంచి రెండు రోజుల్లో వస్తుంది. ఈ వైరల్ ఫీవర్ లక్షణం 7 రోజుల వరకు ఉంటాయి. దీని సాధరణ జ్వరం అనుకొని పొరపాడినట్లయితే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నపిల్లల్లో, వృద్ధులు ,ఏదైనా వ్యాధులు ఉన్నవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కొన్ని లక్షణాలను మనం గుర్తు పెట్టుకొని సరైన సమయంలో డాక్టర్ని సంప్రదిస్తే ఈ వైరల్ ఫీవర్ల నుండి మనం బయటపడవచ్చు. చలితో కూడిన జ్వరము ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, వాంతులు, శ్వాస ఆడక పోవడం ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

సీజనల్ జ్వరం వచ్చినప్పుడు వీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల దుష్ప్రభావాలను చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలలో ,సంవత్సరం కంటే తక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో, 65 ఏళ్ల పైబడిన వాళ్లలో అదే విధంగా క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వైద్యుల్ని  ఎప్పుడు సంప్రదించాలి: 

మీరు జ్వరము వారం రోజులు కూడా కొనసాగినట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. మీకు ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే అప్పుడు కూడా వైద్యున్ని సంప్రదించి సరైన మందులు వాడాలి. జ్వరం కారణంగా మీకు మూత్రం ఆగిపోయినట్లయితే అది చాలా ప్రమాదకరమైనది. అప్పుడు కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ జ్వరం సమయంలో వాంతులు విరోచనాలు అయినప్పుడు కూడా మీరు వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. అదేవిధంగా కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ ఫ్లూలు రాకుండా ఉండడానికి టీకాలు ఉత్తమమైన మార్గం. ఆరు నెలల కంటే ఎక్కువగా ఉన్న పిల్లలు ,పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మీరు ఈ వైరల్ ఫీవర్స్  ప్రమాదం నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.