ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే షుగర్ వచ్చే ముందు మన శరీరము కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని ఫ్రీ డయాబెటిక్ సంకేతాలు అని అంటారు. ఇది మన రక్తంలోని చక్కెరను సాధారణ స్థాయి కంటే కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. ఫ్రీ డయాబెటిస్ ఉన్నవారిలో 10% మందికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి ప్రారంభ సంకేతాలు చూపించినప్పుడు మనం కాస్త జాగ్రత్త పడి నియంత్రించుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ఫ్రీ డయాబెటిస్ ప్రారంభ సంకేతాలు
తరచుగా మూత్ర విసర్జన- మూత్రపిండాలు గ్లూకోజ్ ను ఫిల్టర్ చేయడం ద్వారా పదేపదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది షుగర్ వ్యాధికి ప్రారంభ సంకేతంగా చెప్పవచ్చు.
నీరసం- మధుమేహం వచ్చేముందు మన శరీరంలో చాలా నీరసంగా అనిపిస్తుంది. శరీరం గ్లూకోస్ ని గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. శరీరం తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. మనకు పదేపదే నీరసంగా కూడా అనిపిస్తుంది.
బరువు పెరగడం- ఫ్రీ డయాబెటిస్ లక్షణాల్లో ఆకస్మికంగా బరువు పెరగడం మన శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా సంభవిస్తాయి. దీని ద్వారా మనం అధిక బరువు పెరుగుతాము.
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
చర్మం రంగులో మార్పు - మెడ చుట్టూ చేతుల చుట్టూ శరీరంలో కొన్ని భాగాలలో చర్మం రంగు నల్లబడుతుంది. అలాంటప్పుడు మీరు షుగర్ వ్యాధికి ప్రారంభ దశలో ఉన్నట్టుగా చెప్పే సంకేతం.
నియంత్రణ- మన జీవన శైలిలో కొన్ని మార్పుల ద్వారా మనము ఈ ఫ్రీ డయాబెటిక్ ను నియంత్రించుకోవచ్చు.
పోషకాహారం- మనం తీసుకునే ఆహారంలో తాజా కూర కాయలను, ప్రోటీన్లను, తీసుకోవడం ద్వారా ఈ ప్రీ డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు.
వ్యాయామం- శారీరక వ్యాయామం చేయడం ద్వారా మన రక్తంలోని చక్కర స్థాయి తగ్గుతుంది. రోజుకు కనీసం 45 నిమిషాల పాటు శారీరకంగా శ్రమ చేసినట్లయితే మనం డయాబెటిక్ సమస్య నుంచి బయటపడవచ్చు.
నిద్ర- నిద్రలేమి వల్ల కూడా మనము ప్రీ డయాబెటిస్ బారిన పడతాము నిద్ర లేకపోవడం వల్ల హార్మోనల్లో ఇమ్రాన్సు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు 7 నుంచి 8 గంటల నిద్ర పోవడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఒత్తిడి- తరచుగా ఒత్తిడికి గురయ్యే వారిలో మధుమేహం ప్రమాదం కూడా పెరుగుతుంది. డయాబెటిస్కు హాని కలిగించే శరీరంలోని ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడంలో ఈ ఒత్తిడి సహాయపడుతుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల ఫ్రీ డయాబెటిస్ నుంచి మనం బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.