foods

మన శరీరానికి విటమిన్ డి ఒక ముఖ్యమైన పోషకం. ఇది మనకు ఎముకల గట్టిదనానికి దంతాలను ,కాల్షియం గ్రహించడంలో ఈ విటమిన్ డి సహాయపడుతుంది. అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుంది. ఈ విటమిన్ సహాయంతో మనం అనేక రకాల వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఇబ్బందులు ఏంటో అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

విటమిన్ డి లోపం లక్షణాలు.

మీకు కండరాల నొప్పి ఎముకల్లో నొప్పి అనిపిస్తే అది విటమిన్-డి లోపం అవ్వచ్చు. అదే విధంగా మీరు అలసట తోటి నిరాశ తోటి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే అది కూడా డి విటమిన్ లోపం. విటమిన్ డి లోపం వల్ల మన దంతాలు ఎముకలకు బలహీన పడతాయి ఎముకలు బోల్ వ్యాధి, వికెట్స్ వ్యాధి వంటి వ్యాధులకు దారితీస్తాయి. విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అంటు వ్యాధులు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా డిప్రెషన్ కి కూడా గురవుతారు. వారిలో పిండం ఎదుగుదల సరిగ్గా ఉండదు.

Health Tips: మధుమేహం ఉన్న వారికి ఈ 5 చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్ ..

విటమిన్ డి యొక్క ప్రయోజనాలు.

విటమిన్ డి కాల్షియం సోషణలో సహాయపడుతుంది. ఇది మన దంతాలను ఎముకలను బలంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని డి విటమి పెంచుతుంది. దీనివల్ల ఆందోళన సమస్యల నుండి బయటపడతారు. విటమిన్-డి వల్ల కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. గర్భిణి స్త్రీలకు విటమిన్ డి చాలా ముఖ్యం. ఇది గర్భధారణ సమయంలో శిశువు యొక్క అభివృద్ధికి సహాయపడుతుంది.

విటమిన్ డి ఎలా పెంచుకోవాలి.

సూర్య రష్మి: విటమిన్ దీని పొందడానికి అత్యంత సహజమైన మార్గం సూర్యరష్మి ఉదయం 10 గంటలకు ఎనిమిది నుండి పది గంటల మధ్య అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ప్రతిరోజు 15 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరష్ముల ఉంటే మీకు డి విటమిన్ అనేది అందుతుంది. చేపలు గుడ్డులోని పచ్చ సనా పాలు, పాల ఉత్పత్తులు విటమిన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పుట్టగొడుగుల్లో పన్నీర్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

సప్లిమెంట్స్: మీరు శాఖాహారులైతే తగినంత సూర్య రష్మి అందకపోతే వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లమెంటును తీసుకోవచ్చు. దీని ద్వారా మీకు విటమిన్ పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.