Health Tips: మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే అనేక విటమిన్లు అవసరం ముఖ్యంగా మన శరీర పనితీరుకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నాడీ వ్యవస్థ బలంగా ఉండడానికి విటమిన్ బి 12 అనేది చాలా అవసరం. అయితే విటమిన్ బి12 లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మన శరీరంలో ఇవి ప్రారంభ దశలోనే కొన్ని సంకేతాలను చూపిస్తాయి. వాటిని మనం గమనించి సరైన సమయంలో వైద్యులను సంప్రదించి దానికి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ బి12 లోపం నుంచి బయటపడవచ్చు. అయితే ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తిమ్మిర్లు- విటమిన్ బి12 లోపం వల్ల మొదటిగా కనిపించే సంకేతం కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు మొద్దు మారినట్టు అనిపించడం ఇలాగనక మీకు అనిపిస్తే అది విటమిన్ బి12 లోపం కావచ్చు.
Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ...
చిరాకు, అలసట- విటమిన్ బి 12 లోపం వల్ల శరీరంలో ఇంకా అనే రకాల సమస్యలు ఏర్పడతాయి. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఆందోళన చిరాకు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కాళ్లలో మంట బలహీనంగా అనిపించడం అనేటువంటి సమస్యలు కూడా మీకు మీ శరీరంలో కనిపిస్తున్నట్లయితే అది విటమిన్ లోపం కావచ్చు.
నడకలో ఇబ్బంది- విటమిన్ బి1 లోపం వల్ల నడకలు ఇబ్బందులు ఏర్పడతాయి. వీరు నడిచేటప్పుడు కొంచెం అన్ బాలన్స్ ఇంకా అనిపిస్తుంది. అంటే కాకుండా నరాల బలహీనత సమస్య కూడా ఏర్పడుతుంది. దీని కారణంగానే నడవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది దీనికి కారణం విటమిన్ బి12 లోపం కావచ్చు. వెంటనే సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి