Flax Seeds (Photo Credits: Pixabay)

అవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ,ఫైబర్, విటమిన్స్ ,ఐరన్ ,జింక్ కంటెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అవిస గింజలను పొడిగా చేసుకొని మనం ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీకు గుండెపోటు సమస్యల నుంచి బయటపడతారు.

అంతేకాకుండా చాలామంది హాట్ బాక్స్ తో ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వారు మీ ఆహారంలో ఫ్లాక్ సీడ్స్ ని కనుక భాగంగా చేసుకుంటే మీకు బ్లాక్స్ తగ్గిపోతాయి.

వీటిని పచ్చిగా కాకుండా కాస్త వేయించుకొని తీసుకున్నట్లయితే మీకు దీనిలో ఉండే పోషకాలు అన్నీ కూడా అందుతాయి

అవిసె గింజలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దీని ద్వారా మన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గించడంలో కూడా ఈ అవిస గింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ అవిస గింజల పొడిని మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. చాలామంది కడుపుబ్బరము, కడుపునొప్పి వంటి అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతుంటారు, అటువంటివారు మీరు ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు.

Health Tips: లివర్ ఫెయిల్యూర్ కు 4 ప్రారంభ లక్షణాల ఇవే...

అవిస గింజలు చర్మానికి జుట్టుకు కూడా చాలా పోషన్ని ఇస్తుంది. అవిస గింజలను కాసేపు నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని తలకు పెట్టుకున్నట్లయితే మీ జుట్టు మెరుస్తుంది, అంటే కాకుండా జుట్టు రాలటువంటి సమస్య నుంచి కూడా బయటపడతారు.

ఈ అవిస గింజలను పేస్ట్ చేసుకొని ఆ గుజ్జును మొహం మీద పెట్టుకున్నట్లైతే మీ మొహం తల తలగా మెరుస్తుంది, అంతేకాకుండా మచ్చలు, మొటిమలు వంటి సమస్య నుంచి కూడా బయటపడతారు.

ఇందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల మీ శరీరానికి అంతేకాకుండా మీ గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి. మీ శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాలను తగ్గించడానికి మంచి కొలెస్ట్రాలను పెంచడానికి ఈ అవిస గింజలు సహాయపడతాయి. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ కూడా దీని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీ షుగర్ బిపి లెవెల్స్ నార్మల్గా ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.