burning eyes

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి అద్దాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే ఈ కళ్లద్దాలు పెట్టుకుని పరిస్థితి ఉండేది కానీ రాను రాను ఎక్కువగా ఫోన్ వినియోగించడం, పోషకాహారాల్లోపము వీటివల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి. అయితే మనం మన ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కంటికి చాలామంది ఏ విటమిన్ తో అనేక సమస్యలు తగ్గిపోతాయి. అయితే విటమిన్ ఏ ఎంత అవసరమో విటమిన్ సి కూడా కంటి ఆరోగ్యానికి అంతా ముఖ్యం. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కంటి చూపు పెరగడమే కాకుండా కళ్ళకు సంబంధించిన అనేక రకాల జబ్బులు తగ్గడంలో సహాయపడుతుంది. ఆ పండు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కివి పండు- కివి పండులో ల్యుటిన్, జిక్యాక్సిన్తిన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా అవసరమైన మూలకాలు. ఈ మూలకాల పుష్కలంగా ఉండడం ద్వారా కివి పండును తినడం ద్వారా గ్లూకోమా, క్యాటరాక్ట్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

విటమిన్ సి అధికంగా ఉంటుంది- టీవీలో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి కణాలను దెబ్బతీరకుండా కాపాడుతుంది. స్క్రీన్ ముందు ఎక్కువగా పని చేసే వారికి కివి పండు తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కివి పండు నువ్వు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా కంటి రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది.

Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు ...

కళ్ళు పొడిబారడం తగ్గిస్తుంది- ఎక్కువసేపు స్క్రీన్ చూసే వారిలో కూడా కళ్ళు పొడిబారడం వంటి సమస్య కనిపిస్తుంది. అటువంటివారు ప్రతిరోజు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉన్న కివి పండుని తీసుకోవడం ద్వారా ఇది కళ్ళు పొరపారడాన్ని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా కళ్ళకు తేమని అందిస్తుంది. దీని ద్వారా కళ్ళ పైన ఒత్తిడి మారడం వంటి సమస్యలు తొలగిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి