అల్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న సమస్య. మనకు శరీరం పైన ఏ విధంగా గాయం అవుతుందో శరీరం లోపట అవయవాలకు గాయం అవ్వడాన్నే అల్సర్స్ అంటా.రు దీనివల్ల కడుపునొప్పి, అన్నవాహికలో, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి. దీని ఫలితంగా విపరీతమైన నొప్పి, బర్నింగ్ సెన్సేషన్, ఇతర అసౌకర్యాలు ఏర్పడతాయి. అల్సర్ అనేవి రకరకాలుగా ఉంటాయి. కడుపులో అల్సర్స్ డ్యూడనల్ అల్సర్స్ ,అన్నవాహికకు ఏర్పడే అల్సర్స్ ఇవి ప్రధానంగా ఏర్పడతాయి. అయితే దీనికి కారణాలు చూస్తే కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలతో ఇన్ఫెక్షన్తో ఈ సమస్య అనేది ఏర్పడుతుంది.
ఎన్ని రకాల అల్సర్స్ : మన శరీరంలో కడుపులో అల్సర్ ఏర్పడినట్లయితే దీన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. దీనివల్ల మనకు తరచుగా కడుపులో. నొప్పిగా .మంటగా తిన్న ఆహారం జీర్ణం కానట్టుగా వామిటింగ్ సెన్సేషన్ గా అనిపిస్తుంది.
డ్యూడనల్ అల్సర్స్ : ఇది డ్యూడనల్ అని పిలవబడే ప్రేగుకు మొదటి భాగంలో ఏర్పడుతుంది. ఇది మనం భోజనం చేసిన తర్వాత కడుపులో ఎక్కువగా నొప్పిని మంటను కలిగిస్తుంది. అప్పుడు దీనిని మనం డ్యూడనల్యఅల్సర్ గా గుర్తించవచ్చు
ఇసో ఫ్యాకల్ అల్సర్: ఇవి అన్నవాహిక లోపల ఏర్పడేటువంటి అల్సర్. ఇది ఏర్పడితే మనకు నొప్పి మంటగా ,వామిటింగ్ సెన్సేషన్ గా ఎక్కువగా అనిపించి ఇబ్బందిని కలగజేస్తుంది.
కారణాలు: కడుపులో అల్స ర్స్ రావడానికి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలో కారణమవుతాయి. ముఖ్యంగా హెలికా బ్యాక్టీరియా, పైలోరి బ్యాక్టీరియా ఇవి కారణాలు కావచ్చు. ఇవి మన కడుపు లోపల ఇన్ఫెక్షన్కు గురి చేయడం ద్వారా అక్కడ అల్సస్ కు కారణం అవుతాయి. ఎక్కువగా పొగాకు వాడడం. మద్యపానము అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ అల్సర్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి.
చికిత్స. తగ్గించుకోవడానికి మెడిసిన్స్ వాడినట్లయితే అది కేవలం తాత్కాలికం. మాత్రమే మనం కేవలం మన జీవన శైలిలో మార్పు కారణంగా ఈ అల్సర్ ని తగ్గించుకోవచ్చు.
Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు
ఆరోగ్యకరమైన ఆహారం:ఫైబర్ ఎక్కువగా ,పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన అల్సర్ ను తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఆకుకూరలు నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకుంటే మంచిది. వేయించిన మసాలాలు పుల్లటి కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
ధూమపానం ,మద్యపానం: అధికంగా మద్యం సేవించడం వల్ల పొగాకు తీసుకోవడం ద్వారా అల్సర్ సమస్య మరింత విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.
స్ట్రెస్ కి దూరంగా ఉండాలి: ఈరోజుల్లో చాలామంది యువత ఇబ్బంది పడే సమస్య. ఒత్తిడికి ఒత్తిడికి గురవడం వల్ల కూడా ఈ అల్సర్ సమస్య పెరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం పద్ధతులను ఉపయోగిస్తే ఈ సమస్య తగ్గుతుంది.
సర్జరీ: ఒకవేళ మీరు తీవ్ర సమస్యతో బాధపడుతున్నట్లయితే మందులు జీవనశైలిలో మార్పుల వల్ల కూడా మీ సమస్య నయం కాకపోతే చికిత్స అవసరమవుతుంది. వైద్యుని సహాతో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకొని మీ జీవన శైలిలో మార్పు చేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి