కొంతమందిలో ఎటువంటి కారణం లేకుండా కూడా తరచుగా వాంతులు అవుతూ ఉంటాయి. దీని కారణంగా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వారు వారి ప్రయాణాన్ని ఆనందించలేరు. అయితే కొన్నిసార్లు సాధారణంగా కూడా వికారంగా వాంతులుగా అనిపిస్తుంది. అటువంటి అప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

అరటిపండు- కొంతమందికి వార్తలు అవుతున్నప్పుడు వచ్చే అరటి పండు తీసుకోవడం ద్వారా వాంతులు వికారం సమస్య తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా తరచుగా వచ్చే వాంతులు నుండి బయటపడవచ్చు.

Health Tips: మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణాలు, చిట్కాలు ...

నిమ్మకాయ- నిమ్మకాయ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వాంతులు, వికారం వంటి సమస్యల పైన ప్రభావితంగా పనిచేస్తుంది. మీకు తరచుగా వాంతులు అవుతున్నప్పుడు నిమ్మకాయ వాసనను కానీ లేదా నిమ్మరసాన్ని కానీ తీసుకున్నట్లయితే దీని నుంచి బయటపడవచ్చు.

 సోంపు- ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. నోటి దుర్వాసన వచ్చేవారిలో కూడా ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇది వాంతులను తగ్గించడానికి సహాయపడుతుంది. మీకు వామిటింగ్ సెన్సేషన్ లేదా వికారంగా అనిపించినప్పుడు కాస్త సోంపుని నవ్విల్లినట్లయితే వాంతుల నుండి బయటపడవచ్చు.

లవంగాలు- లవంగాలు కూడా వాంతులు వికారాన్ని తగ్గిస్తాయి. ఇది ప్రతి ఇంట్లో కూడా లభించే సులభమైన పదార్థము మీకు వికారంగా, వాంతులు అనిపించినప్పుడు కొన్ని లవంగాలను నోట్లో ఉంచుకున్నట్లయితే వాంతో సమస్యలు తగ్గిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి