Cervical-Cancer.

చాలామందిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంది. దీన్ని క్యాండిడియాస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. వీరికి ఎక్కువగా విసనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. మహిళల్లో వేగంగా పెరుగుతున్న ఈ సమస్య దీనికి ఈస్ట్ అనే ఒక రకమైన ఫంగస్ కారణం. మన శరీరంలో ఈస్ట్ బ్యాలెన్స్ లేనప్పుడు అతివేగంగా పెరుగుతుంది. దీని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. వెజినల్ ఇన్ఫెక్షన్ అనేది వాపు, నొప్పి, దురద వంటి లక్షణాలను ఇస్తుంది. ఒక్కొక్కసారి ఇది తీవ్రమైన సమస్యగా చెప్పవచ్చు. దానికి కారణాలు లక్షణాలు చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ కి కారణాలు

యాంటీబయాటిక్స్ అధికంగా వాడడం- మన శరీరంలో బ్యాక్టీరియా ,ఈస్ట్ సమాన పరిమాణంలో ఉంటాయి. అయితే యాంటీబయోటిక్స్ ను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా ఇది బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ఇలా కాండిడా పెరగడం అనేది సులభం చేస్తుంది. యాంటీబయోటిక్స్ ఉపయోగించినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా మాత్రమే కాకుండా ఉపయోగపడే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. దీనివల్ల ఈస్ట్ అనేది పెరుగుతుంది. అని ఇది అతివేగంగా పెరగడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

Health Tips: మీరు ఈ 7 ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటుంటే వాటిని వెంటనే ఆపండి ...

హార్మోన్ల మార్పులు- మహిళల్లో వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. గర్భస్రావం లేదా పీరియడ్స్ సమయంలో లేదా గర్భనిరోధక మాత్రల వల్ల కూడా హార్మోనాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇది క్యాండిడా పెరుగుదలను పెంచుతుంది. దీనివల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది.

మధుమేహం- మధుమేహం వల్ల కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. మన శరీరంలో రకరకాల ఇన్ఫెక్షన్లను కూడా పెంచుతుంది. మధుమేహం ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంటువ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది దీని వల్ల తరచుగా వస్తుంది.

వెజైనల్ ఏరియాలో తేమగా ఉండడం- చాలామంది వెజైనల్   ఏరియాలో సరిగ్గా ఆరనివ్వకపోవడం తేమె ఎక్కువగా ఉండటం వల్ల ఈస్ట్ పెరుగుదలకు దారితీస్తుంది. మహిళలు ఎక్కువగా టైట్ గా ఉండే లెగ్గిన్స్, సింథటిక్ వంటి లోదిస్తులను, బిగుతుగా ఉండే దుస్తులు ధరించినప్పుడు ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కాబట్టి మీకు గాలి తగిలి అవకాశం తక్కువగా ఉండడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఆ ప్రమాదం పెరుగుతుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు.

వెజైనల్  ప్రాంతాల్లో తీవ్రమైన దురదగా అనిపిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ గా అనిపిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. తెల్లటి జిగురులాంటి పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. కొన్నిసార్లు వాపు, ఎరుపు, దద్దుర్లు కూడా ఉంటాయి. నడవడం కూర్చోవడం కూడా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి.

తడి బట్టలను ఎక్కువసేపు మన శరీరం పైన ఉంచుకోవద్దు. బిగుతుగా ఉండే ప్యాంట్లను షట్లను అండర్వేర్లను ఉపయోగించకూడదు.

గాలి ప్రసరించేలాగా కాటన్ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అధిక సబ్బులను పెర్ఫుములను వాడడం కూడా మంచిది కాదు . ప్రోబయోటిక్స్ ను కూడా అధికంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు. అధికంగా చక్కెర ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను పెంచుతాయి. వీటి ద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి