obesity

ఆరోగ్యకరమైన శరీరం కావాలని ఎవరికి ఉండదు. మనము ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలని బరువు తగ్గాలని కోరుకుంటాం. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా మన జీవనశైలిలో మార్పులు కారణంగా దాన్ని అనుసరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే కొన్ని అలవాట్లు మన జీవనశైలిలో చేర్చుకున్నట్లైతే మనము ఈజీగా బరువు తగ్గవచ్చు. ఎటువంటి వ్యాయామాలు శ్రమ లేకుండా మన పొట్టను తగ్గించుకోవడానికి కొన్ని అలవాట్లు చేసుకుంటే చాలా ఉత్తమం. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకు.

గోరువెచ్చని నీరు: ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం ద్వారా మీ జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేర్కొన్న మలినాలను తొలగించడంలో సహాయపడి మీ మెటబాలిజం రేట్లు పెంచుతుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ద్వారా మీ పొట్టలోని కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడతారు.

జీలకర్ర నీరు: ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం ద్వారా మీ శరీరానికి ఎన్నో పోషకాలు అంది ఎంతో మేలు జరుగుతుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన బరువును తగ్గించడంలో సహాయపడతాయి. జీలకర్ర మన జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది.

Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా

మెడిటేషన్: ధ్యానం ,యోగ మన శరీరానికి మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయాన్నే ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిని తగ్గించడం ద్వారా హార్మోనల్ ఇంబాలన్స్ ఉండదు. కాబట్టి బరువు పెరగడానికి కారణమైన స్ట్రెస్ హార్మోన్లను తగ్గించడానికి ఈ ధ్యానం మెడిటేషన్ సహాయపడతాయి.

బ్రేక్ ఫాస్ట్: చాలామంది బరువు తగ్గడం కోసం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. కానీ ఇది ఎట్టి పరిస్థితిలో సరైనది కాదు. మీరు బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన పోషకాహారమైన అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల మీరు రోజంతా కూడా శక్తిగా ఉంటారు. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉండేలాగా చూసుకోవాలి దీని ద్వారా మీకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఫ్రూట్స్: బరువు తగ్గడం కోసం తాజా పండ్లను తాజా కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. తాజా పనులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి తాజా పండ్లను, కూరగాయలను తీసుకుంటే మీకు ఫైబర్ లభించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.