Filter Coffee World Record (Credits: X)

చాలామంది కాఫీ తోటే వారి రోజును ప్రారంభిస్తారు. చాలామందికి టీ తో పోలిస్తే కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యాక్టివ్ గా ఉండాలి అనుకున్నా అంటే ఈ కాఫీ ఒక మంచి ఆప్షన్.  కాఫీని రోజుకు ఎన్ని సార్లు తీసుకోవాలి? అతిగా కాఫీ తీసుకోవడం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అయితే కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అదేవిధంగా మితిమీరి ఎక్కువగా కాఫీ తీసుకోవడం ద్వారా మన శరీరానికి చాలా హానికరం.

ప్రతిరోజు ఎన్ని కప్పుల కాఫీ తీసుకోవాలో తెలుసుకుందాం.

ప్రతిరోజు రెండు నుండి మూడు కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతకుమించి ఎక్కువగా కాఫీ తీసుకోవడం చాలా హానికరం. అయితే ఇది ఒకేసారి ఇబ్బందిని కలిగించకుండా రాను రాను  మీ ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గుండెపైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని ఒక అధ్యయనంలో తేలింది. వయసు పెరుగుతున్న కొద్ది ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల గుండె సంబంధం సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బిపి, షుగర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

ప్రతిరోజు మూడు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఇందులో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువగా కెఫిన్ మన హృదయ స్పందన రేటుని సక్రమంగా పనిచేయనీయదు. అంతేకాకుండా ఇది మన శరీరానికి తగినంత శక్తిని ఇవ్వదు. దీన్ని తీసుకోవడం ద్వారా బీపీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.

 కాఫీ వల్ల కలిగే నష్టాలు.

జీర్ణ వ్యవస్థ: మీరు అధికంగా కాఫీ తీసుకోవడం ద్వారా అందులో ఉన్న కేఫిన్ మన జీర్ణ వ్యవస్థను ఇబ్బందికి గురిచేస్తుంది. దీని ద్వారా జీర్ణ క్రియ కు సంబంధించిన అనేక రకాలైనటువంటి సమస్యలు మొదలవుతాయి. గ్యాస్ ప్రాబ్లం, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు పెరుగుతాయి.

అధిక రక్తపోటు: అతిగా కాఫీ తీసుకోవడం వల్ల మీ బిపి పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉన్న కెఫెన్ రక్త సరఫరాను వేగాన్ని పెంచుతుంది. దీని ద్వారా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇది తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది.

గుండె సమస్యలు: అధికంగా కాఫీ తీసుకునే వారిలో గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా..

గర్భధారణ సమయంలో: గర్భంతో ఉన్న మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ ని తీసుకోకూడదు. ఇది మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదకరం. ఇందులో ఉన్న కెఫెన్ బిడ్డ ఆరోగ్యం పైన తీవ్ర ప్రమాదాన్ని చూపిస్తుంది. కాబట్టి కడుపుతో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీకి ఎవైడ్ గా ఉంటే మంచిది.

అయితే ఎప్పుడైనా సరే ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒకటి రెండు కప్పులు కాఫీ మంచిదే ఇది కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా కాఫీ తీసుకోవడం ద్వారా మన శరీరంలో క్యాలరీలు కూడా బర్నవుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.