breast cancer

గత కొంతకాలంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తమ ఆరోగ్యం కోసం మహిళలు తగినంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. థైరాయిడ్, పిసిఒడి, క్యాన్సర్ మొదలైన కొన్ని ప్రధాన వ్యాధుల్లో కూడా మహిళలు ఈ రోజుల్లో బాధితులుగా ఉన్నారు.  క్యాన్సర్ గురించి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణమైన క్యాన్సర్ అని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు.

రొమ్ము క్యాన్సర్  సూచించే సంకేతాలు

చనుమొనల ఆకారం లో మార్పు, రొమ్ము గట్టిపడటం, రక్తస్రావం చనుమనల నుండి ద్రవం రావడం, నొప్పి, రొమ్ము పైన ఉన్నటువంటి చర్మము పొట్టు రాలడం అండరామ్స్ లో గడ్డలు ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ కి సంకేతాలు.

రొమ్ము క్యాన్సర్ ను ఎలా నివారించాలి.

పౌష్టికాహారం తినండి : ఈరోజుల్లో రొమ్ము క్యాన్సర్ పెరగడానికి ముఖ్యంగా కారణాలు మన జీవనశైలిలో మార్పు కారణం కాబట్టి జంక్ ఫుడ్ మానేసి తాజా కూరగాయలను పండ్లను అదేవిధంగా గోధుమ గడ్డి వంటి పోషకాహారాలు ఉన్న వాటిని ఎక్కువగా తీసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ని మనము ప్రారంభ దశలోనే నివారించవచ్చు.

తల్లి పాలు ఇవ్వడం:  వల్ల కూడా క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు తల్లిపాలు ఇవ్వని మహిళలతో పోలిస్తే ఇచ్చిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఐదు నుండి 10% తక్కువగా ఉంది.

వ్యాయామం:  అధిక బరువు రొమ్ము క్యాన్సర్ కు ప్రధాన కారణం. అందుకే ప్రతి రోజు కూడా వాకింగ్ యోగ జిమ్ వంటివి చేసినట్లయితే మీ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోయి మీ శరీరాన్ని చురుకుగా ఉంచి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ధూమపానం ,మద్యపానము : పురుషులతో పోలిస్తే స్త్రీలలో కొంచెం ధూమపానం మద్యపానము అలవాటు కాస్త తక్కువే అయినప్పటికీ ధూమపానం మద్యపానం వల్ల కూడా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మహిళలు ఈ రెండిటికీ కూడా దూరంగా ఉన్నట్లయితే మీరు రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.

గర్భనిరోధక మాత్రలు: దాటిన తర్వాత 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మంచిది కాదు దీని ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది ఈ మాత్రం మానేసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఈ గర్భనిరోధక మాత్రలు గుండెపోటును తీసుకొచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి కాబట్టి వాటిని మానేయడమే ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.