నేరేడు పండును అందరూ ఇష్టపడుతుంటారు. ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ లు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. చాలామంది ఈ పండు తిన్న తర్వాత విత్తనాలు పడేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మీరు ఎప్పటికీ ఆ గింజలను పడవేయరు. ఈ నేరేడు గింజల పొడి తో క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ ,బిపి రోగాల్లో ఈ పొడిని ఔషధంగా ఉపయోగిస్తారు. కేవలం నేరేడు పండు మాత్రమే కాదు ఆ గింజల్లో అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ విత్తనాలు రెగ్యులర్గా మీరు తీసుకున్నట్లయితే మీ షుగర్ ఎప్పటికీ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. అవేంటో తెలుసుకుందాం.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది : నేరేడు గింజల పొడి మీ బరువు తగ్గించడంతో చాలా బాగా ఉపయోగపడుతుంది: ప్రతిరోజు ఈ పొడిని నిద్రలేచిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటితో తీసుకున్నట్లయితే మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోయి మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.
చర్మాన్ని మెరుగుపరచడం: నేరేడు గింజల పొడి మీ మొహం పైన ఉన్న మచ్చలు, మొటిమలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడిలో కొన్ని పాలు పోసుకొని పేస్ట్ లాగా చేసుకుని రాత్రి పడుకునే ముందు మొహానికి రాసుకొని ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కున్నట్లయితే మీ మొహం పై ఉన్న మచ్చలు మొటిమలు అన్నీ కూడా తొలగిపోతాయి.
మధుమేహం: నేరేడు గింజలు షుగర్ వ్యాధికి అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. ఈ పండులో ఉన్న ప్రతి భాగం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అన్ని కూడా ఔషధానాలను కలిగి ఉండి మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు నేరేడు గింజల పొడిని మీరు పరిగడుపున రెండు నుంచి మూడు గ్రామాల్లో మోతాదులో తీసుకున్నట్లయితే మీ షుగర్ లెవెల్స్ ఎప్పటికీ కంట్రోల్ లో ఉంటాయి.
జీర్ణ క్రియను సక్రమంగా ఉంచుతుంది: నేరేడు పండుతో పాటు దానికి గింజలను కూడా మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపునొప్పి, అజీర్ణం, వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ఈ పొడిని రెగ్యులర్ గా మీరు ఆహారంలో బాగా చేసుకున్నట్లయితే మీ మలబద్దకం సమస్య అనేది తగ్గిపోతుంది.
బీపీ పేషెంట్స్: ఈ రోజుల్లో చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అటువంటివారు ఈ నేరేడు గింజల పొడిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. బీపీ వల్ల గుండెపోటు వచ్చేటువంటి సమస్య పెరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఆహారంలో బాగా చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
క్యాన్సర్ ను నివారిస్తుంది: నేరేడు గింజల్లో ఉన్నటువంటి క్వాలిఫైనాల్స్ వంటి ఫైటో కెమికల్స్ క్యాన్సర్ నుండి రక్షించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో ఉండే ఆమెతో సైనిను ఇది క్యాన్సర్ మరియు గుండె జబ్బుల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుంది ఈ నేరేడు పండు నేరేడు గింజలు రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
నేరేడు గింజల పొడి చేసుకునే విధానం: విత్తనాలను సేకరించి వాటిని బాగా కడగాలి. కడిగిన తర్వాత ఎండలో ఉంచి ఆరబెట్టాలి .ఈ విధంగా రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండలో ఎండిన తర్వాత వాటిని పొడి చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక స్పూన్ పొడిని గోరువెచ్చటి నీటితో తీసుకున్నట్లయితే పైన చెప్పిన అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.