మనము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి కావాల్సినంత పోషకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. పోషకాల లోపం కారణంగా మనలో అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో ఆరోగ్యం బాగా లేనప్పుడు అది ఖచ్చితంగా కొన్ని లక్షణాలను చూపిస్తుంది. మన శరీరంలో పోషకాలు తగ్గినప్పుడు అవి ఎటువంటి సంకేతాలను చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మగత- మీకు పదే పదే నిద్ర వస్తున్నట్లయితే అది ఒక పోషకాహార లోపంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మన శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా మెగ్నీషియం లోపం వల్ల మధుమేహం బిపి వంటి సమస్యలు కూడా వస్తాయి. మీ శరీరంలో మెగ్నీషియన్ని పెంచుకోవడం కోసం పాలకూర బచ్చలి కూర, అరటిపండు వంటి వాటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీకు ఈ సమస్యలు తగ్గుతాయి.
శక్తి లేకపోవడం- ఏ చిన్న పని చేసినప్పుడు కూడా మీరు బలహీనంగా అనిపించి శరీరంలో శక్తి లేకపోతే అది ఐరన్ లోపంగా చెప్పవచ్చు. మన శరీరానికి ఐరన్ అనేది అత్యంత ముఖ్యమైన మూలకం మన శరీరంలో రక్తహీనత ఏర్పడినప్పుడు ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. ఐరన్ కోసం మీరు ప్రతిరోజు క్యారెట్ బీట్రూట్ రసం, ఎండు ద్రాక్షాలు, నానబెట్టిన బాదం గింజలు తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది.
Health Tips: రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా..
బలహీనత- అలసట బలహీనత వల్ల మన శరీరము కండరాల నొప్పికి మన శరీరంలో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా మన శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. బలహీనత వల్ల మనం చేసే పని మీద కూడా మనకు ఏకాగ్రత ఉండదు. మీ శరీరంలో పొటాషియం తగ్గినప్పుడు ఈ బలహీనత ఏర్పడుతుంది. అటువంటి అప్పుడు మీరు కొబ్బరి నీరు త్రాగడం అరటిపండు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో పొటాషియం లోపం నుండి బయటపడవచ్చు.
ఉదయం కళ్ళు తిరగడం- ఉదయాన్నే లేవగానే చాలామందికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం జింక్ లోపం జింకు లోపం వల్ల తల తిరిగినట్లుగా కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్య కూడా ఏర్పడుతుంది. జింక్ లోపం వల్ల మన శరీరము కొన్ని వైరస్ల బారిన పడుతుంది. జింకు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
తరచుగా తలనొప్పి- ఎటువంటి కారణం లేకుండా తరచుగా తలనొప్పి వస్తుంది. ఇలా రావడం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది . మీ శరీరంలో సోడియం సరిపడనంతగా లేనప్పుడు ఈ తలనొప్పి ఏర్పడుతుంది. మీకు ఈ తలనొప్పి అనిపించినప్పుడు కొద్దిగా ఉప్పును కలిపిన మీరును తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.