మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాలేయం దెబ్బ తినడానికి ప్రధానమైన కారణాలు జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లు నిద్రలేమి, ఒత్తిడి వల్ల కాలేయం పనితీరు సరిగా ఉండదు. మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవి కనిపిస్తే కాలేయం ప్రమాదంలో ఉన్నట్లే. కాబట్టి దయచేసి ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి
కామెర్లు: మీ కాలేయంలో సమస్య మొదలైతే ఖచ్చితంగా అది కామెర్ల రూపంలో ప్రారంభమవుతుంది. చర్మం ,కళ్ళు పసుపు రంగులో కనిపిస్తాయి. కాలేయం డామేజ్ అవుతుందన్నడానికి ఇది ప్రధాన లక్షణం కామెర్లు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన మందులు వాడితే ఫలితం ఉంటుంది.
ఆకలి తగ్గడం: మీకు ఆకలి వేయకుండా ఉండి నోటికి రుచి కూడా తెలియకుండా ఉన్నట్లయితే అది కాలేయ సమస్యగా చెప్పవచ్చు. కొంచెం తిన్న తర్వాత కూడా పొట్ట నిండుగా అనిపించడం, కడుపు ఉబ్బరంగా కడుపు బరువుగా అనిపించడం ఏదైనా తిన్న వెంటనే వికారంగా అనిపించి వామిటింగ్ సెన్సేషన్ రావడం కూడా కాలేయ వ్యాధికి లక్షణం.
మూత్రం రంగులో మార్పు: కాలేయ సమస్య ఉన్న వారిలో మూత్ర విసర్జన సమయంలో మూత్రము ముదురు పసుపు రంగులోకి వస్తుంది. అదే విధంగా మలం రంగు కూడా తెలుపు రంగులోకి మారుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కాలేయ సమస్య ఉన్నట్లే.
కడుపు నొప్పి: మీకు కడుపునొప్పి వాపు ఎక్కువగా అనిపిస్తే ముఖ్యంగా కుడి వైపున పై భాగంలో నొప్పి ఎక్కువగా అనిపిస్తే అది కాలేయం దెబ్బతిన్నదని లక్షణాలలో ఒకటిగా చెప్పవచ్చు.
Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా
నీరసం: ఏ పని చేయడానికి కూడా శరీరము సహకరించదు. తీవ్రమైన అలసట బలహీనతగా అనిపిస్తుంది. గాయమైనప్పుడు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఇబ్బంది పెట్టడం పెడుతుంది. ఇటువంటి సమస్య ఉన్నట్లయితే మీకు కాలేయ సమస్య ఉన్నట్లు.
చర్మం పైన దురద: కాలే వ్యాధి సాధారణ లక్షణాల్లో చర్మం పైన దురదగా ఉండి దద్దుర్లు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి బ్యాంకులియస్ క్యాన్సర్ ప్రైమరీ బిలియనరీ సిరోసిస్ వంటివి కూడా రావచ్చు.
ఈ లక్షణాలు గనక మీలో కనిపిస్తే మీకు కాలేయ వ్యాధులైన హెపటైటిస్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ వంటి వివిధ రకాలైనటువంటి జబ్బులు గా మనం చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి రోగనిర్ధారణ పరీక్ష చేయించుకొని డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం ముఖ్యం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.