క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ క్యాన్సర్ లో ఉండే సమస్య ఏమిటంటే దాని లక్షణాలు ప్రారంభ దశలో మనం గుర్తించలేము. కాబట్టి ఈరోజు మనము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు గురించి తెలుసుకుందాం. శరీరంలో కొన్ని కనిపించే అసాధారణ లక్షణాలు క్యాన్సర్ కు కారణం కావచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడం: ఎటువంటి కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం క్యాన్సర్ సంకేతం కావచ్చు. మీ శరీరంలో క్యాన్సర్ ప్రారంభ దశలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు వాటికి శక్తి అవసరం కాబట్టి మీ శరీరం నుండి శక్తి తీసుకుంటున్నప్పుడు మీరు వేగంగా బరువు తగ్గుతారు. తద్వారా క్యాన్సర్ లక్షణమని గుర్తించవచ్చు.
నీరసం: కారణం లేకుండా ప్రతి దానికి కూడా నీరసంగా అనిపించడం కూడా క్యాన్సర్ ప్రాథమిక లక్షణం. మీరు ఎంత విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ కూడా అలసిపోయినట్లుగా అనిపిస్తే కొన్ని పరీక్షలు చేసుకోవడం ఉత్తమం.
Health Tips: పసుపు గురించి ఎవరికీ తెలియని ఈ నిజాలు తెలిస్తే...షాక్
శరీరంలో నొప్పి : శరీర భాగాలన్నిటిలో కూడా నొప్పి రావడం కూడా క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణం చాలామంది పెయిన్ కిల్లర్ల ద్వారా దీని తగ్గించుకుంటారు. అయితే ఒకసారి క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటే ఉత్తమం.
పుట్టుమచ్చలు: మీ శరీరం పైన కొన్ని రకాల మార్పులు గమనించినట్లయితే ఇది కూడా క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు. పుట్టుమచ్చలు ఏర్పడడం శరీరం పైన దద్దుర్లు, పుట్టుమచ్చల పరిమాణంలో మార్పు కనక వస్తే అది చర్మ కాన్సర్ సంకేతం.
తరచుగా యూరినేషన్: క్యాన్సర్ ప్రారంభ దశలో మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. ఇది కూడా క్యాన్సర్కు సంకేతం కావచ్చు.
జీర్ణ సమస్యలు :కొన్నిసార్లు కడుపునొప్పి కడుపులో మంట అధికంగా ఉండి ఉంటే అది పెద్ద పేగు క్యాన్సర్ ప్రారంభ లక్షణంగా గుర్తించవచ్చు. ఆకలి లేకపోవడం కడుపు ఉబ్బరంగా ఉండడం ఏమి తినాలనిపించకపోవడం బలహీనత బరువు తగ్గడం కూడా క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.