Mosquitoes Released to Save Rare Birds (Credits: X)

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైతుంది .దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల నుండి మనం కాపాడుకోవడానికి తరచుగా దోమతెరలను, రీఫిల్స్, ఓడోమాస్ వంటి వాటిని ఉపయోగిస్తాం. అయితే ఇవి కెమికల్స్ తో తయారైన కాబట్టి మన శరీరానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా రీఫిల్స్ ను ఒడమాస్ వంటివి వాడడం ద్వారా ఎలర్జీ వంటి సమస్యలు వస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి కాకుండా పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయి. ముఖ్యంగా దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇంట్లో చేసే కొన్ని రకాల స్ప్రేలతోటి ఈ దోమల బెడద నుండి మనము బయటపడవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేప నూనె: దోమల నుండి రక్షించుకోవడానికి వేప నూనె చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ స్ప్రేన్ తయారు చేయడానికి 10 ml వేప నూనెను తీసుకొని ఒక 40 ml కొబ్బరి నూనె తీసుకొని ఈ రెండు నూనెలను కలిపి స్ప్రే బాటిల్ లో నింపండి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో దోమలు ఉన్న ప్రదేశంలో స్ప్రే ని కొట్టినట్లయితే దోమల బెడద తక్కువవుతుంది. అంతేకాకుండా మీ శరణ్యానికి కూడా రాసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Health Tips: షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా.

పేపర్ మెంట్ ఆయిల్: రిపరిమెంట్ ఆయిల్ కూడా దోమల నుండి రక్షిస్తుంది. ఇది అన్ని ఆయుర్వేద షాపులలో లభిస్తుంది. దీన్ని ఒక పది చుక్కల పెపర్మెంటు నూనెను ఒక టెన్ నెంబర్ వాటర్ లో కలిపి ఈ మిశ్రమాన్ని స్ప్రేగా సిద్ధం చేసుకుని గదిలో దోమలు ఎక్కువగా ఉన్నచోట దీన్ని స్ప్రే చేసినట్లయితే దోమల సమస్య తగ్గుతుంది.

లవంగ నూనె: లవంగ నూనె కూడా దోమలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి 10 చుక్కల లవంగం తీసుకొని ఒక 10 ml నీరుని కలిపి దోమలు రాకుండా ఆ మిశ్రమాన్ని స్ప్రే గా ఉపయోగించుకోండి. దీన్ని మీరు శరీరాన్ని కూడా అప్లై చేసుకున్నట్లయితే దోమలు మీకు కుట్టకుండా ఉంటే కాకుండా దోమల అధికంగా ఉన్న ప్రదేశంలో స్ప్రే చేసినట్లయితే దోమలు బెడద తగ్గుతుంది.

స్ప్రే మాత్రమే కాకుండా కొన్ని రకాల మొక్కలు కూడా దోమల నుండి మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి చుట్టూ తులసి, పుదీనా, అలోవెరా వంటి మొక్కలు నాటినట్లయితే ఇటీ సహజంగానే దోమలు వీటి నుండి దూరంగా వెళ్తాయి. ఇది వాతావరణం కూడా కలుషితం కాకుండా చేస్తాయి. దోమలను నివారించడంలో తులసి మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వేపాకులను తీసుకొని ఎండిపోయిన తర్వాత వాటిని పొగలాగ చేసుకుని ఇంట్లో పొగ వేసుకున్నట్లయితే కూడా ఈ దోమల బెడద తగ్గుతుంది. వీటి ద్వారా వచ్చే మలేరియా, టైఫాయిడ్  వంటి జ్వరాలు నుండి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి