ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మన జీవిత కాలాన్ని రెట్టింపు చేసుకుంటూ నాణ్యమైన జీవితాన్ని గడపడానికి మన ఆహారంలో కొన్ని అలవాటు చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం- బాదం మన ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో గుడ్ ఫాట్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో నానబెట్టిన బాదం సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉండడం వల్ల మన చర్మానికి మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
మెంతి గింజలు- మెంతులను కూడా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగినట్లయితే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. మెంతి గింజలు మన శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యానికి కండరాల్లో నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండడం ద్వారా వాపులను తగ్గిస్తుంది.
Health Tips: ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో బాధపడుతున్నారా.
ఎండు ద్రాక్ష- ఎండు ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ అందిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. నానబెట్టిన ఎండు ద్రాక్షను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేర్కొన్న వ్యర్ధాలన్నీ బయటికి పోయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి బయటపడతారు.
సన్ ఫ్లవర్ సీడ్స్- పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఈ వల్ల మన చర్మానికి జుట్టుకు చాలా ప్రయోజనం మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల బిపి సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు. ఇది కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి