jaggery (File Pic)

బెల్లము తేన రెండిట్లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అయితే బెల్లం లో అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, ఐరన్, మినరల్స్, వంటివి ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందించటంతో పాటు జీర్ణ క్రియ కూడా చాలా పనిచేస్తుంది. అదే విధంగా తేనెలో కూడా అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. బెల్లం మంచిదా తేనె మంచిదా అనే సమస్యతో ఎక్కువమంది ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు మనం బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..

బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు- బెల్లాన్ని చెరుకునుండి తీస్తారు. ఇది భారతీయ సాంప్రదాయాల్లో తీపి ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటారు. బెల్లంలో సహజంగా చక్కెర కలిగి ఉంటుంది. ఇది శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలసటను నీరసాన్ని తగ్గిస్తుంది. మన శరీరంలో రక్త లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులో మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడిగా చెప్పవచ్చు.

Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

తేనె ప్రయోజనాలు- తేనె పువ్వుల నుండి లభించే ఒక సహజమైన తీపి ఉత్పత్తి ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తేనెలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తోటి పోరాడి మన శరీరానికి రక్షణ ఇస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే బెల్లం కంటే తేనె గ్లైసిమిక్ ఇండెక్స్ ను తక్కువగా కలిగి ఉంటుంది. దీని కారణంగా మన శరీరం నెమ్మదిగా దీన్ని గ్రహిస్తుంది. దీని వల్ల రక్తంలోని చక్కర స్థాయి నియంత్రణలో ఉంటాయి. ఇది  కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది.

ఏది మంచిది- బెల్లం తో పోలిస్తే తేనెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. మీరు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బెల్లం తీసుకోవడం ద్వారా గ్లైసి మీకు ఇండెక్స్ పెరుగుతుంది. దీని ద్వారా డయాబెటిక్ రోగులకు కాస్త షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తేనెను తీసుకున్నట్లయితే మంచిది తేనెలో జీర్ణ ఎంజైములు ఉంటాయి. ఇది జీర్ణ క్రియ కూడా మంచిది.. బెల్లం ,తేనె రెండు కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ కూడా బెల్లం కంటే తేనే ఉత్తమమైనది. ఇది షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి కొన్ని రకాల ఎంజాయ్లు ఉత్పత్తి చేస్తుంది. మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కాబట్టి తేనె ఉత్తమమైనది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి