chikpea

శనగలు మనందరికీ బాగా తెలుసు. వీటిని నానబెట్టుకొని పోపేసుకొని తింటాం. ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క శుభకార్యం లో ఈ శనగలను వాడుతూ ఉంటాం. ఇందులో మటన్ ,చికెన్ కంటే అధికంగా ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులకు ఇది ఒక ప్రోటీన్ సోర్స్ గా చెప్పవచ్చు. కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, ఇవ్వండి మూలకాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని అందించేవే. ప్రతిరోజు నాన పెట్టిన శనగల్లు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నానబెట్టిన శనగలను ప్రతిరోజు ఒక గుప్పెడు తీసుకున్నట్లయితే ఇందులో కార్బోహైడ్రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. శనగలను నానబెట్టి తీసుకోవడం ద్వారా వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. తద్వారా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ లో ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ నిరభ్యంతరంగా ఈ నానబెట్టిన శనగలను తీసుకోవచ్చు. నానబెట్టిన శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీని ద్వారా అధిక బరువు నుండి కూడా బయటపడతారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి , పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది గుండె సంబంధ జబ్బులు ఉన్నవారికి క్యాన్సర్ రోగులకు చక్కటి పరిష్కారం.

Health Tips: ముఖం పైన మచ్చలు, మొటిమలు సమస్యతో బాధపడుతున్నారా ...

నానపెట్టిన శనగల్లో ప్రోటీన్ అధికంగా ఉండడం ద్వారా మీరు వ్యాయామానికి ముందుగా ఒక గుప్పెడు నానబెట్టిన శనగలను తీసుకున్నట్లయితే మీకు కండరాలకు శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ సమస్యతో ప్రోటీన్ లోపం సమస్యతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. అదేవిధంగా చర్మం నిగారింపుకు జుట్టు పోషణకు కూడా ఈ శనగలు ఎంతో సహకరిస్తాయి. నానపెట్టిన శనగలను తీసుకున్నట్లయితే ఇది జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఏకాగ్రతకు చక్కటి రెమిడిగా పని చేస్తుంది. అంతేకాకుండా చాలామంది అల్జీమర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ శనగల్ని తీసుకున్నట్లయితే మీ సమస్య తక్కువవుతుంది.

చాలామందికి మొహం పైన తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. అంతా కాకుండా కొన్ని రకాలైన చర్మ సంబంధ వ్యాధులను కూడా ఉంటాయి. అటువంటివారు ఈ నానబెట్టిన శనగలను మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీకు ఆ సమస్య నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.