pimples

చాలామంది యువతలో ఈ మధ్యన ఎక్కువగా కనిపించే సమస్య మొహం పైన ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని ద్వారా నలుగురిలోకి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మన ఇంట్లోనే దొరికే కొన్ని ఆహార కొన్ని పదార్థాలతోటి ఈజీగా మన ఫేస్ పైన మచ్చలను  తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ మచ్చలు మొటిమలు రాకుండా ఉంటాయి. చాలా మంది జంక్ ఫుడ్ ను ఇష్టపడుతుంటారు. ఆయిల్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం ద్వారా అవి కొవ్వు గడ్డలుగా మారి మొటిమలుగా ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంతే కాకుండా పొల్యూషన్ వల్ల కూడా కొంతమందిలో ఈ మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. మొటిమల తర్వాత వాటిని అవి మచ్చల రూపంలో ఏర్పడి వికారంగా కనిపిస్తాయి. తల పైన చుండ్రు ఉన్నప్పుడు కూడా మనకు మొటిమల సమస్య అధికమవుతుంది.

Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా ...

మొటిమలు తగ్గించుకోవడానికి అధికంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అంతే కాకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఈ మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. మార్కెట్లో దొరికే అనేక రకాలైనటువంటి ఫేస్ క్రీములు వాడడం ద్వారా కూడా ఈ మొటిమల సమస్య అధికమవుతుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటికి దూరంగా ఉండి నాచురల్ పద్ధతిలోనే వాటిని తగ్గించే ప్రయత్నం చేసుకుంటే మంచిది.

మొటిమల సమస్యతో బాధపడేవారు ఒక ఆలుగడ్డను పేస్టులాగా చేసుకొని దానిలో కొంచెం శనగపిండి కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా చేసుకొని మొహానికి అప్లై చేసుకుంటే మీ మొటిమలు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి. మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి పైన టూత్ పేస్టు రాస్తే ఆ మొటిమలు తగ్గిపోతాయి. ఆ మచ్చ కూడా తగ్గిపోతుంది. మొటిమల అధికారంలో ఉన్నప్పుడు అలోవెరా గుజ్జుని మొహానికి అప్లై చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే మొటిమలు మచ్చలు తగ్గుముఖం పడతాయి. మొటిమలు అధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు సబ్బులు ఫేస్ వాష్ లను వాడకూడదు. కేవలం చల్లనీటితో మాత్రమే వాష్ చేసుకోవాలి దీని ద్వారా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.